Begin typing your search above and press return to search.

11 ఏళ్ల బాలికకు 50 ఏళ్ల వ్యక్తి గుండె... అక్కడ ఇది పదోసారి!

శ్రీకాకుళం జిల్లాలో ఒక వ్యక్తికి బ్రెయిన్‌ డెడ్‌ అవ్వడంతో.. ఆ గుండెను కొన్ని గంటల వ్యవధిలోనే తిరుపతిలో మరో రోగికి అమర్చడంతో మళ్లీ కొట్టుకోవడం మొదలుపెట్టింది!

By:  Tupaki Desk   |   20 Dec 2023 6:34 AM GMT
11 ఏళ్ల బాలికకు 50 ఏళ్ల వ్యక్తి గుండె... అక్కడ ఇది పదోసారి!
X

శ్రీకాకుళం జిల్లాలో ఒక వ్యక్తికి బ్రెయిన్‌ డెడ్‌ అవ్వడంతో.. ఆ గుండెను కొన్ని గంటల వ్యవధిలోనే తిరుపతిలో మరో రోగికి అమర్చడంతో మళ్లీ కొట్టుకోవడం మొదలుపెట్టింది! ఈ అద్భుతం తిరుపతిలోని శ్రీపద్మావతి హృదయాలయంలో చోటు చేసుకుంది. గుండె సమస్యతో బాధపడుతున్న 11ఏళ్ల చిన్నారికి వైద్యులు పాత గుండెను తొలగించి మరోవ్యక్తి గుండెను అమర్చారు.

అవును... తాజాగా గుండె మార్పిడి ఆపరేషన్ ను తిరుపతి లోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం వైద్యులు విజయవంతంగా పూర్తిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆసుపత్రిలో గుండె వైద్యం, శస్త్రచికిత్సలతోపాటు గుండె మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో తాజాగా నిర్వహించిన గుండెమార్పిడి శస్త్రచికిత్సతో వాటి సంఖ్య పదికి చేరింది.

వివరాళ్లోకి వెళ్తే... తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా వనస్థలిపురానికి చెందిన 11 ఏళ్ల చిన్నారి లహరి గుండె సమస్యతో బాధపడుతోంది. ఈ సమయంలో ఆమెకి గుండెమార్పిడి అవసరమని వైద్యులు గుర్తించారు. ఈ సమయంలో గుండె మార్పిడి కోసం ఆమె జీవన్‌ దాన్‌ పోర్టల్‌ లో పేరు నమోదు చేసుకుంది. ఈ సమయంలో వైద్యులు ఆమెను శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయంకు సిఫార్స్ చేశారు.

ఈ సమయంలో నవంబర్‌ 6న ఇక్కడి వైద్యులు పరీక్షించారు. ఈ సమయంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 50 ఏళ్ల వ్యక్తి స్ట్రోక్‌ తో బ్రెయిన్‌ డెత్‌ కు గురికావడంతో కుటుంబ సభ్యులు అతని అవయవదానానికి ముందుకు వచ్చారు. దీంతో... శ్రీకాకుళంలోని జేంస్ ఆసుపత్రిలో గుండెను సేకరించి అక్కడి నుంచి హెలికాప్టర్‌ లో వైజాగ్‌ కు.. అనంతరం అక్కడనుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి తీసుకొచ్చారు.

అలా రేణిగుంట విమానాశ్రయానికి వచ్చిన ఆ గుండెను... గ్రీన్‌ ఛానల్‌ ద్వారా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ ప్రక్రియకు సుమారు మూడు గంటల సమయం పట్టింది. ఈ సమయంలో... అప్పటికే ఆపరేషన్‌ థియేటర్‌ లో సిద్ధంగా ఉన్న డాక్టర్‌ శ్రీనాథ్‌ రెడ్డి, డాక్టర్‌ గణపతి ఆధ్వర్యంలో ఆ బాలికకు విజయవంతంగా గుండెమార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు.