గాసిప్స్ ఆరోగ్యానికి మంచివట.. ఎలాగంటే..?
గాసిప్స్ చెప్పుకోవడం మంచిదా.. చెడుదా..? అనే విషయంలో నైతికతతో కూడిన సమాధానం సంగతి కాసేపు పక్కనపెడితే.. హెల్త్ పరంగా మాత్రం మంచిదనే విషయం తాజా అధ్యయనంలో తేలింది.
By: Tupaki Desk | 24 May 2025 12:41 AM ISTగాసిప్స్ చెప్పుకోవడం మంచిదా.. చెడుదా..? అనే విషయంలో నైతికతతో కూడిన సమాధానం సంగతి కాసేపు పక్కనపెడితే.. హెల్త్ పరంగా మాత్రం మంచిదనే విషయం తాజా అధ్యయనంలో తేలింది. ఆ పరిశోదన ప్రకారం గాసిప్స్ చెప్పడం వల్ల మహిళలకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయని.. వారిలో మానసిక ప్రశాంతత పెరుగుతుందని అంటున్నారు.
అవును... గాసిప్ అనేది పూర్తిగా స్త్రీలకు సంబంధించిన విషయంగా భావిస్తారు! అయితే.. పురుషులు కూడా మహిళలతో పాటు సమానంగా గాసిప్స్ లో పాలుపంచుకుంటారని నిరూపించబడిందని చెబుతారు! ఈ క్రమంలోనే తాజా అధ్యయనంలో.. గాసిప్స్ అనేది మహిళల ఆరోగ్యానికి మేలు చేస్తుందని.. వారిలో మానసిక ఒత్తిడి తగ్గడానికి ఈ గాసిప్స్ సహకరిస్తాయని అంటున్నారు.
ఉదాహరణకు... ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆఫీసులో కూర్చొని పనిచేసి అలసిపోయిన అనంతరం.. ఫ్రెండ్ తో కూర్చుని టీ లేదా కాఫీ తాగుతున్న సమయంలో.. కాసేపు గాసిప్స్ మాట్లాడుకుంటే ఒత్తిడి తగ్గుతుందని అంటున్నారు! గాసిప్స్ లేని టీ /కాఫీ బ్రేక్స్ అసంపూర్తిగా ఉంటాయని.. ఆ సమయంలో కాసేపు ఏదైనా విషయం మాట్లాడుకుంటే ఈజీ మూడ్ లోకి వెళ్తామని చెబుతున్నారు!
ఖాళీ సమయాల్లో కానీ, సెలవు దినాల్లో కానీ స్నేహితులతో కూర్చున్నప్పుడు సినిమాలు చూడటం, సరదా సంభాషణలు చేయడంతో పాటు కొన్ని గాసిప్స్ మాట్లాడుకోవడం.. పైగా అది ఆ ఇద్దరు, ముగ్గురు మధ్య మాత్రమే ఉండేట్లు చూసుకోవడం అనేది.. వారి బంధం బలపడానికి దోహదపడుతుందని చెబుతున్నారు! ఈ విషయంలో గ్రూపులో ఒకరిపై ఒకరు నమ్మకంగా ఉండటం మస్ట్ అని చెబుతున్నారు!
ఇదే సమయంలో.. బంధువుల్లో వారిని టార్గెట్ చేస్తూ అవహేళన చేసేవారు.. వారిని తక్కువ చేసి మాట్లాడేవారి గురించి.. అవతలి వ్యక్తి చెప్పే గాసిప్స్ ఎంతో రిలాక్స్ ని ఇస్తాయని చెబుతున్నారు! అయితే... ఈ గాసిప్స్ పూర్తిగా మానసిక ఉల్లాసం కోసం, కాస్త టైమ్ పాస్ కోసం అన్నట్లుగా ఉండాలే తప్ప.. కుటుంబాలు, జీవితాలు నాశనం చేస్తే స్థాయిలో ఉండకుండా చూసుకోవడం కనీస నైతికత అని గుర్తు చేస్తున్నారు!
