Begin typing your search above and press return to search.

నిద్ర మీద సర్వే.. చదివి తీరాల్సిందే!

తిండి లేకుండా గడపొచ్చేమో కానీ నిద్ర లేకుండా గడపటం సాధ్యమే కాదు. రెండు.. మూడు రోజులు తిండి లేకుండా మేనేజ్ చేస వీలుంది.

By:  Tupaki Desk   |   15 Jun 2025 11:00 PM IST
నిద్ర మీద సర్వే.. చదివి తీరాల్సిందే!
X

తిండి లేకుండా గడపొచ్చేమో కానీ నిద్ర లేకుండా గడపటం సాధ్యమే కాదు. రెండు.. మూడు రోజులు తిండి లేకుండా మేనేజ్ చేస వీలుంది. కానీ.. రెండు.. మూడు రోజులు నిద్ర లేకుండా ఉండటం సాధ్యమే కాదు. నిద్ర అవసరం మనిషికి ఎంతన్న దానికి ఇదో చక్కటి ఉదాహరణ. నిద్ర విషయంలో ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొందరు కళ్లు మూసినంతనే నిద్ర పడితే.. మరికొందరు మాత్రం నిద్ర కోసం పెద్ద యుద్ధమే చేస్తారు. ఇంతకూ మంచి ఆరోగ్యానికి ఎంత నిద్ర అవసరం ఉన్నది అడిగితే.. 7-8 గంటలుగా చెబుతారు.

అయితే.. నిద్ర కాస్త తగ్గినా.. పెరిగినా పెద్దగా ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. అంతేకాదు.. నిద్ర అన్నది ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుందన్న విషయాన్ని తాజా సర్వేలో గుర్తించారు. అంతేకాదు.. అంతకు మించిన చాలానే అంశాల్ని ఈ సర్వేలో గుర్తించారు. తక్కువ.. ఎక్కువ అన్న నిద్ర కంటే.. ప్రతి దేశం.. ఆ దేశ కల్చర్ కు అనుగుణంగా నిద్ర పోవటం చాలామంచిదని చెబుతున్నారు. దేశ సంస్కృతిని అనుసరించి నిద్ర పోవటమే మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుందని చెబుతున్నారు.

కొన్ని దేశాలకు చెందిన వారు అవసరానికి మించి నిద్ర పోవటంతో ఆరోగ్య సమస్యల్ని కొని తెచ్చుకుంటున్న విషయాన్ని గుర్తించారు. ఇప్పటివరకు నిద్ర సరిగా పోకపోవటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని భావించేవారు. తాజా సర్వే మాత్రం అందుకు భిన్నమైన ఆసక్తికర అంశాల్ని వెల్లడించింది. బ్రిటన్ పౌరులు 10.26 గంటలు సగటున నిద్రపోతున్నారని.. సాధారణ సగటుకు మించి ఇది చాలా ఎక్కువని.. అతిగా నిద్రపోవటం కారణంగా ఆరోగ్య సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నట్లుగా సర్వే వెల్లడించింది. అంతేకాదు.. ఎవరు ఎన్ని గంటలు నిద్రపోవాలన్న ప్రశ్నకు సమాధానం చెప్పటం చాలా కష్టమైనదిగా పేర్కొన్నారు.

మనిషి రోజుకు ఎనిమిది గంటలు నిద్ర పోవటం అవసరమన్న దానికి ఎలాంటి ఆధారాల్లేవని సర్వే పేర్కొంది. కీలే వర్సిటీ స్లీప్ సైకాలజిస్టు డాక్టర్ దల్జిందర్ చామర్స్ చేస్తున్న సూచన చూస్తే..‘‘మీ నిద్ర.. ఆరోగ్యం విషయంలో మీ సంస్కృతిని పరిగణలోకి తీసుకోవాలి’’ అని ఆయన చెబుతున్నారు. ఇదే విషయాన్ని మరింత వివరంగా విక్టోరియా స్కూల్ ఆఫ్ నర్సింగ్ లో అసిస్టెంట్ గా పని చేస్తున్న డాక్టర్ క్రిస్టీన్ మాట్లాడుతూ.. ‘‘ఒక దేశంలో తగినంత నిద్ర.. మరో దేశంలో అతి నిద్ర కావొచ్చు. లేదంటే చాలినంత నిద్ర కాకుండా ఉండొచ్చు’’ అని పేర్కొనటం గమనార్హం.

అమెరికాలో 8.13 గంటల పాటు నిద్రపోయే వారిలో అనారోగ్య సమస్యల్ని కొని తెచ్చి పెట్టుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. ఈ సర్వేలో భాగంగా ఉత్తర అమెరికా.. దక్షిణ అమెరికా.. ఐరోపా.. ఆసియా.. ఆఫ్రికా తదితర 20 దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. దాదాపు 5 వేల మంది నుంచి సమాధానాల్ని రాబట్టారు. ఈ డేటాను విశ్లేషిస్తే.. నిద్రపోయే గంటల మధ్య ఉన్న లింకును లెక్కలోకి తీసుకొని విశ్లేషించారు.

భారతీయులు సగటున 7.15 గంటలుగా గుర్తించారు. ఆసక్తికర అంశం ఏమంటే.. నిద్ర విషయంలో ప్రపంచ సగటు.. మనది ఇంచుమించు ఒకేలా ఉండటం గమనార్హం. మిగిలిన దేశాల వారితో పోలిస్తే ఫ్రాన్స్ దేశస్తులు మిగిలిన వారి కంటే ఎక్కువ నిద్రపోతున్నారు. వారు 7.52 గంటలు నిద్ర పోతున్నారు. అందరికంటే తక్కువగా నిద్రపోయే దేశస్తులుగా జపనీయులు నిలిచారు. వారు కేవలం 6.18 గంటలు మాత్రమే నిద్ర పోతున్నారు.

బ్రిటన్ దేశస్తులు 7.33 గంటలు నిద్రపోతే.. అమెరికన్ల స్లీప్ టైం 7.02 గంటలు మాత్రమే. అంతేకాదు.. ఆరోగ్యకారక ఆదర్శ నిద్రా సమయం అన్నది ఏ దేశంలోనూ లేదని గుర్తించారు. తక్కువ సగటు నిద్ర వ్యవధి ఉన్న దేశాల వారిని.. ఎక్కువసేపు నిద్రపోయే దేశాల్లోని వ్యక్తులతో పోల్చినప్పుడు వారి ఆరోగ్యం ఆధ్వానంగా ఉందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని గుర్తించారు. దేశ సంస్కృతికి అనుగుణంగా నిద్ర గంటలు ఉంటాయని తేల్చారు.