Begin typing your search above and press return to search.

కోవిడ్‌ తో ముడిపడి ఉన్న మెదడు వ్యాధి.. ఒకరు బలి!

అవును... కోవిడ్‌ తో ముడిపడి ఉన్న ప్రాణాంతకమైన మెదడుకు సంబంధించిన ఒక సరికొత్త వ్యాధి తెరపైకి వచ్చింది

By:  Tupaki Desk   |   2 Oct 2023 4:35 AM GMT
కోవిడ్‌ తో ముడిపడి ఉన్న మెదడు వ్యాధి.. ఒకరు బలి!
X

మనిషి మనుగడను ప్రశ్నార్ధకం చేసినంత పనిచేసి, జీవితాలను ఉక్కిరీ బిక్కిరి చేసి, లక్షల కుటుంబాలను రోడ్లపైకి తెచ్చిన కోవిడ్ - 19 గురించి ఎంత చెప్పుకున్న తక్కువే! ప్రస్తుతం దాని ప్రభావం అంతగాలేదని అంటున్నారు కానీ... రూపం మార్చుకున్నట్లుగా, శేషం ఇంకా మిగిలే ఉందన్నట్లుగా పరోక్షంగా అది సృష్టిస్తున్న అలజడులు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఇందులో భాగంగా తాజాగా కోవిడ్‌ తో ముడిపడి ఉన్న ప్రాణాంతక మెదడు వ్యాధి తెరపైకి వచ్చింది.

అవును... కోవిడ్‌ తో ముడిపడి ఉన్న ప్రాణాంతకమైన మెదడుకు సంబంధించిన ఒక సరికొత్త వ్యాధి తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా తాజాగా ఈ వ్యాదివల్ల అమెరికాలో 62 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ కేస్ రిపోర్ట్స్‌ లో భాగంగా... తాజాగా ఒక వ్యక్తి మౌంట్ సినాయ్ క్వీన్స్ హాస్పిటల్ లో చేరాడు. అతడు సరిగా నడవలేకపోవడం, జ్ఞాపకశక్తి మందగించడం వంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడని తెలుస్తుంది.

గత రెండు నెలలుగా ఈ వ్యక్తి జ్ఞాపకశక్తి మందగించడం, శరీరంలో కదలికలు నెమ్మదించడం, నోటి నుంచి సొంగ కారుతుండటం వంటి ఇబ్బందులను ఎదుర్కొనేవాడట. ఇదే సమయంలో... అప్పుడప్పుడూ నడవలేక ఇంట్లో పడిపోవడం జరిగేదంట. ఇలా ఊహించని మార్పుకు గల కారణాలను తెలుసుకోవడం కోసం హాస్పటల్ కు వెళ్లాడు.

ఈ సమయంలో అడ్మిషన్స్ కి ముందు రెగ్యులర్ గా చేసే కోవిడ్-19 పరీక్ష చేశారు. దీంతో... అతనికి రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చింది. అయితే.. సాధారణంగా కోవిడ్ పాజిటివ్ వ్యక్తిలో కనిపించే జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు ఏమీ ఇతనిలో లేకపోవడం గమనార్హం.

దీంతో రెగ్యులర్ గా కనిపించే కోవిడ్ లక్షణాలు లేకపోవడంతో పాటు జ్ఞాపకశక్తి మందగించడం, శరీరంలో కదలికలు నెమ్మదించడం, ఉన్నపలంగా కాళ్లు పట్టుతప్పి పడిపోవడంతో పాటు, నియంత్రణ లేకుండా నోటి నుంచి ద్రవాలు కారుతుండటం వంటి లక్షణాలతో... ప్రాబబుల్ ప్రియాన్ డిసీజ్ అని నిర్ధారణకు వచ్చారు వైద్యులు!

దీంతో ఈ ప్రియాన్ డిసీజ్ కి కోవిడే కారణం అని వైద్యులు భావిస్తున్నారు. అయితే అదే పూర్తి కారణం అని చెప్పడానికి ఖచ్చితమైన ఆధారలు లేనప్పటికీ... ధృవీకరించడానికి మనిన్ని పరిశోధనలు అవసరం అని చెబుతున్నారు వైద్యులు.! దీంతో కోవిడ్ - 19 వల్ల మెదడు నరాలకు వచ్చే వ్యాదుల ప్రభావాన్ని కొట్టిపారేయలేమని వైద్యులు అంటున్నారు.

కాగా... కోవిడ్-19 ఊపిరితిత్తులపై మాత్రమే కాదు మెదడుపై కూడా ప్రభావం చూపిస్తుందని వైద్యులు చెబుతున్న సంగతి తెలిసిందే. కోవిడ్ వచ్చిన కొత్తలో... దీనివల్ల... గుండెపోటు, ఆందోళన, తికమక, అలసట.. ఇలా ఏదైన జరగవచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి! ఈ క్రమంలోనే కరోనా వైరస్ సోకితే నాడీ వ్యవస్థకు కూడా అపాయమేనని రాను రాను స్పష్టవవుతోందని అంటున్నారు.