Begin typing your search above and press return to search.

మధుమేహం - కాఫీ... తెరపైకి సరికొత్త విషయం!

అవును... మధుమేహం - కెఫీన్‌ రిలేషన్ పై యూరప్ లో జరిగిన ఒక అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

By:  Tupaki Desk   |   27 Feb 2024 11:30 PM GMT
మధుమేహం - కాఫీ... తెరపైకి సరికొత్త విషయం!
X

ఇటీవల కాలంలో వయసుతో ఏమాత్రం సంబంధం లేకుండా వస్తున్న వ్యాధుల్లో మధుమేహం ఒకటి! ఈ వ్యాధి బారిన పడక ముందు ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకపోయినా... ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడితే నోటికి తాళం వేయాల్సిన పరిస్థితి వస్తుందని చెబుతుంటారు! ఈ సమయంలో తాజాగా మధుమేహానికీ, కాఫీకి ఉన్న బంధంపై ఒక అధ్యయనం తెరపైకి వచ్చింది. ఇందులో ఆసక్తిగర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అవును... మధుమేహం - కెఫీన్‌ రిలేషన్ పై యూరప్ లో జరిగిన ఒక అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో భాగంగా బ్లడ్ లో కెఫిన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నవారికి టైప్ - 2 మధుమేహం ముప్పు తక్కువగా ఉన్నట్లు బయటపడిందట. ఇది బరువును తగ్గించడం ద్వారా.. మధుమేహం ముప్పును తగ్గేలా చేస్తున్నట్లు వెల్లడైందని తెలుస్తుంది.

వాస్తవానికి కెఫిన్ వాడకానికీ, బరువు తగ్గడానికి మధ్య సంబంధం ఉంటున్నట్లు చాలా కాలంగా తెలిసిన విషయమే. అందువల్లే బరువు తగ్గించే ట్యాబ్లెట్స్ లో రెగ్యులర్ గా కెఫీన్‌ ను చేర్చుతుంటారు. దీంతో ఇది శరీరం ఎక్కువ శక్తిని ఖర్చు చేసుకునేలా పురిగొల్పుతుందని.. ఫలితంగా బరువు తగ్గడానికి తోడ్పడుతుందని చెబుతున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... కాఫీ ఎక్కువ తాగినంత మాత్రాన్న మధుమేహాన్ని నివారించుకోవచ్చా అని అంటే... కానే కాదు! కారణం... తాజ అధ్యయనం చెప్పిన విషయం ఏమిటంటే... కెఫీన్‌ వినియోగానికి బదులు బ్లడ్ లో కెఫీన్‌ మోతాదుల గురించి మాత్రమే చెబుతుందనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అయితే... బరువు తగ్గితే సాధారణంగా గుండెజబ్బులు, పక్షవాతంతో పాటు మధుమేహం వంటి జబ్బుల ముప్పు తగ్గుతుంది.

మరింత డిటైల్డ్ గా మాట్లాడుకోవాలంటే... శరీరంలో కెఫిన్ జీవక్రియలు వేగవంతం కావడంలో సీవైపీ1ఏ2, ఏ.హెచ్.ఆర్. జన్యువులు పాలు పంచుకుంటున్నట్లు గుర్తించారు. ఈ సమయంలో ఈ జన్యువులు గలవారిలో కెఫిన్ జీవక్రియ నెమ్మదిగా సాగుతుందని.. తక్కువ కాఫీ తాగేవారి రక్తంలో కూడా కెఫిన్ మోతాదులు ఎక్కువగా ఉంటున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇది బరువు తగ్గటానికి తోడ్పడుతుందని.. ఫలితంగా మధుమేహం ముప్పు తక్కువగా ఉంతుందని వివరిస్తున్నారు.

అంతేకానీ... కాపీ ఎక్కువగా తాగేసినంత మాత్రాన్న మధుమేహం తగ్గుతుందని మాత్రం తాజా అధ్యయనం సూచించడం లేదనే విషయాన్ని గుర్తించాలి. ఇదే సమయంలో... కాఫీ మరీ ఎక్కువగా తాగితే... హార్ట్ బీట్ పెరగడం, చిరాకు, ఆందోళన, నిద్రలేమి మొదలైన సమయలు వస్తాయనే విషయాన్ని మరిచిపోకూడని అంటున్నారు!