ఈ సంకేతాలుంటే మీ గుండెకు ముప్పే.. ముందుగా మేలుకోండి
మన శరీరం లోపల ఏదైనా సమస్య ఉన్నప్పుడు అది బయటికి కొన్ని సూచనల రూపంలో సంకేతాలు ఇస్తుంది.
By: Tupaki Desk | 16 Aug 2025 6:00 PM ISTమన శరీరం లోపల ఏదైనా సమస్య ఉన్నప్పుడు అది బయటికి కొన్ని సూచనల రూపంలో సంకేతాలు ఇస్తుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యం బలహీనమైతే శరీరం ఇచ్చే చిన్న చిన్న మార్పులను నిర్లక్ష్యం చేస్తే పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. గుండె సరిగా పనిచేయకపోతే రక్తప్రసరణలో ఆటంకాలు కలుగుతాయి. దీని ప్రభావం నేరుగా శ్వాస, అలసట, శరీర కదలికలపై పడుతుంది. వైద్య నిపుణుల సూచనల ప్రకారం గుండె బలహీనంగా ఉన్నప్పుడు కనిపించే కొన్ని ముఖ్య సంకేతాలు ఇవి.
1. తరచూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
సాధారణ పనులు చేస్తున్నప్పటికీ శ్వాస ఆడకపోవడం, మెట్లు ఎక్కినప్పుడు లేదా నడిచినప్పుడు గాలి ఆడకపోవడం గుండె బలహీనత సంకేతం కావచ్చు.
2. చేతులు, కాళ్ల వాపు
గుండె బలహీనమై రక్తప్రసరణలో అంతరాయం కలిగితే శరీరంలోని ద్రవాలు నిల్వ అవుతాయి. దీంతో కాళ్లు, పాదాలు, చేతులు వాపు వస్తాయి.
3. తరచూ అలసట
చిన్న పనులు చేసినా శరీరం బలహీనంగా అనిపించడం, శక్తి తగ్గిపోవడం గుండె సరిగా పని చేయకపోవడానికి సూచన కావచ్చు.
4. ఛాతిలో బరువు లేదా నొప్పి
ఛాతీలో బరువుగా అనిపించడం, ఒత్తిడి కలగడం, కొన్నిసార్లు నొప్పి రావడం గుండె సంబంధిత సమస్యలకు సంకేతమని వైద్యులు చెబుతున్నారు.
5. రాత్రి నిద్రలో ఇబ్బంది
పడుకునే సమయంలో ఊపిరి ఆడకపోవడం, దగ్గు రావడం, నిద్ర లేచి కూర్చోవాల్సి రావడం గుండె బలహీనతను సూచిస్తుంది.
6. గుండె వేగం అసాధారణంగా మారడం
కొన్నిసార్లు గుండె వేగంగా కొట్టుకోవడం, కొన్నిసార్లు నెమ్మదిగా దడపడం వంటి పరిస్థితులు గుండె బలహీనంగా ఉన్నప్పుడు తరచూ కనిపిస్తాయి.
ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి?
ఈ లక్షణాలు తరచుగా కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం అవసరం. గుండె బలహీనతను ప్రారంభ దశలో గుర్తిస్తే మందులు, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా పరిస్థితిని నియంత్రించవచ్చు.
జాగ్రత్తలు
సరైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, మితమైన నిద్ర, మానసిక ఒత్తిడిని అధిగమించడం
