Begin typing your search above and press return to search.

వైద్య నిపుణులు దిగ్భ్రాంతి... కోకా కోలాతో కిడ్నీలో 35 రాళ్లు!

అవును... భారతదేశానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి అనేక సంవత్సరాలుగా రోజూ కోకాకోలా డ్రింక్ తాగడం అలవాటుగా చేసుకున్నాడంట.

By:  Tupaki Desk   |   30 Jun 2025 7:00 PM IST
వైద్య నిపుణులు దిగ్భ్రాంతి... కోకా కోలాతో  కిడ్నీలో 35 రాళ్లు!
X

కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగొద్దని, వీలైతే అసలూ తాగొద్దని.. చల్లని మజ్జి, కొబ్బరి బొండం నీళ్లు, బార్లీ నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు, వైద్యులు చెబుతుంటారు! కాకపోతే కూల్ డ్రింక్స్ పై ఉన్న మోజు కాస్తా ఆ మాటలు చెవి వరకూ చేరినా, అంతకు మించి లోపలికి వెళ్లనివ్వదు. అలాంటి ఓ వ్యక్తి కథ తాజాగా తెరపైకి వచ్చింది.. షాకింగ్ గా మారింది.

అవును... భారతదేశానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి అనేక సంవత్సరాలుగా రోజూ కోకాకోలా డ్రింక్ తాగడం అలవాటుగా చేసుకున్నాడంట. అది కూడా ప్రతీరోజూ సుమారు 3 లీటర్ల చొప్పున. తాగేవాడంట. దీంతో అతడి కిడ్నీలో 35 రాళ్లు ఏర్పడ్డాయి. దీంతో.. ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

తాజాగా బయటపడిన ఈ కేసులో... వైద్యులు ఫాస్పోరిక్ ఆమ్లం, చక్కెరను అధికంగా తీసుకోవడం వల్ల రాళ్లు ఏర్పడతాయని చెబుతున్నారు! మితమైన కోలా వినియోగం తక్కువ ప్రమాదాలను కలిగిస్తుందని మునుపటి అధ్యయనాలు సూచించినప్పటికీ.. ఈ కేసు మాత్రం మితిమీరి తాగడం వల్ల నిర్దిష్ట జీవక్రియ కోలుకోలేని నష్టాన్ని ఎలా సృష్టిస్తుందో చూపిస్తుందని చెబుతున్నారు.

ఇదే సమయంలో... కోకా-కోలాలోని ఫ్రక్టోజ్, ఫాస్పోరిక్ ఆమ్లం కలిసి శరీరం సహజ వడపోత వ్యవస్థను హైజాక్ చేస్తాయని చెబుతున్నారు! ఇలా ప్రతి రోజు 3 లీటర్లు తాగేటప్పుడు.. కాలేయం భారీ మొత్తంలో ఫ్రక్టోజ్‌ ను ఆక్సలేట్, యూరిక్ ఆమ్లంగా మారుస్తుందని.. ఇది సాధారణ స్థాయిలతో పోలిస్తే మూత్రంలో ఆక్సలేట్ విసర్జనను ఇది 40% వరకు పెంచుతుందని అంటున్నారు.

అదే విధంగా... మెగ్నీషియం విసర్జనను కూడా కోకాకోలా తగ్గిస్తుందని చెబుతున్నారు. తగినంత సిట్రేట్, మెగ్నీషియం లేకుండా.. మూత్రపిండాలు సూపర్‌ శాచురేటెడ్ స్ఫటికీకరణ గదులుగా మారుతాయని.. ఈ క్రమంలో... ఇక్కడ కాల్షియం ఆక్సలేట్ రాళ్ళు.. సూపర్‌ సాచురేషన్, న్యూక్లియేషన్, అగ్రిగేషన్ అనే మూడు దశల ప్రక్రియ ద్వారా ఏర్పడతాయని అంటున్నారు.