ఇండియాలో విస్తరిస్తోన్న క్యాన్సర్... సీపీఎంబీ షాకింగ్ డిటైల్స్!
ఈ క్రమంలో... ఉస్మానియా విశ్వవిద్యాలయంలో క్యాన్సర్ పై పరిశోధనలు చేస్తున్న సెంటర్ ఫర్ ప్లాంట్ మాలిక్యులర్ బయాలజీ (సీపీఎంబీ) శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేపట్టారు.
By: Tupaki Desk | 25 Oct 2023 3:00 AM GMTఒకప్పుడు క్యాన్సర్ అనేది అత్యంత అరుదైన వ్యాది అని చెప్పేవారు. నూటికో కోటికో ఒకరికి వస్తుందనే కామెంట్లు వినిపించేవి. పైగా అప్పట్లో ఈ వ్యాది సోకితే ప్రాణాలపై ఆశలు పెట్టుకునే అవకాశం కూడా చాలా అరుదుగా ఉండేదని అనేవారు! అయితే ఇప్పుడు క్యాన్సర్ విపరీతంగా విస్తరిస్తోందని.. అత్యంత వేగంగా అలుముకుంటుందని అంటున్నారు నిపుణులు!
అవును... మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న సిగరెట్లు, బీడీలు, గుట్కా, వినియోగం, శరీరానికి వ్యాయం లేకపోవడం, పౌష్టికాహార లోపం మొదలన ప్రధాన కారణాలతో దేశవ్యాప్తంగా క్యాన్సర్ వేగంగా విస్తరిస్తోందని తెలుస్తుంది. ఆ విస్తరణ ప్రతి లక్ష మందిలో 100 మంది వేర్వేరు క్యాన్సర్లతో బాధపడుతున్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇందులో భాగంగా... జాతీయ క్యాన్సర్ నమోదు జాబితా గతేడాది గణాంకాలను ప్రామాణికంగా తీసుకున్న శాస్త్రవేత్తలు.. అందులోని అంశాల ఆధారంగా విశ్లేషణ చేపట్టారు. ఈ క్రమంలో... ఉస్మానియా విశ్వవిద్యాలయంలో క్యాన్సర్ పై పరిశోధనలు చేస్తున్న సెంటర్ ఫర్ ప్లాంట్ మాలిక్యులర్ బయాలజీ (సీపీఎంబీ) శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేపట్టారు. ఈ సందర్భంగా కీలక విషయాలు వెల్లడించారు.
ఈ వివరాల ప్రకారం... 2020లో దేశవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ బాధితుల సంఖ్య 2022 నాటికి అయిదు శాతం పెరిగిందని, అందులో భాగంగా... బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలలో వీటి బారిన పడుతున్న పురుషుల కంటే మహిళల సంఖ్యే ఎక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి.
ముఖ్యంగా మెట్రో నగరాలు, పట్టణాల్లో.. నోరు, కాలేయం, ఊపిరితిత్తులు, రొమ్ము మొదలైన అనేక క్యాన్సర్లకు పొగాకు వినియోగం, మారిన లైఫ్ స్టైల్ కారణాలని తేలిందని సీపీఎంబీ వెల్లడించింది! వీటిలో ప్రధానంగా పురుషుల్లో... నోటి కుహరం, ప్రొస్టేట్, ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్లు ఎక్కువగా బాధిస్తుండగా... మహిళల్లో రొమ్ము, గర్భాశయ, అండాశయ క్యాన్సర్లు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.
ఇదే సమయంలో పొగాకు, దాని ఉత్పత్తులను వినియోగిస్తున్న వారిలో 42 శాతం పురుషులు, 14 శాతం మహిళలు ఈ వ్యాదిబారిన పడుతున్నవారిలో ఉన్నారని తేలిందని చెబుతున్నారు. దీంతో... ఈ విషయాలపై సీపీఎంబీ నిపుణులు కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా.. పొగాకు, ఆల్కహాల్ కు దూరంగా ఉండడంతో పాటు శారీరక శ్రమ, పౌష్టికాహారం వల్ల చాలా క్యాన్సర్లు దరిచేరవని చెబుతున్నారు.