Begin typing your search above and press return to search.

కొత్త వేరియంట్ కు బూస్టర్ డోస్ తో చెక్ చెప్పాలా?

కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోస్ వేసుకోవాల్సిన అవసరం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

By:  Tupaki Desk   |   25 Dec 2023 9:55 AM GMT
కొత్త వేరియంట్ కు బూస్టర్ డోస్ తో చెక్ చెప్పాలా?
X

ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి టెన్షన్ తీరిందనుకున్న వేళ.. కొత్త వేరియంట్ తో సరికొత్తగా వ్యాపిస్తున్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ తో కేసులు పెరుగుతున్న వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వేళ.. గడిచిన వారంగా కొత్త కేసుల వ్యాప్తికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. దాదాపు ఆర్నెల్ల తర్వాత కొవిడ్ మార్గదర్శకాల్ని విడుదల చేస్తూ కేంద్రం.. జాగ్రత్త చర్యల్ని వెల్లడించటం తెలిసిందే.

కరోనా కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 కు సంబంధించిన కేసులు దేశంలో నెమ్మదిగా వ్యాపిస్తున్నాయి. కేరళలో తొలి కేసు నమోదు కాగా.. ఇటీవల గోవా.. మహారాష్ట్రలతో పాటు పలు రాష్ట్రాల్లోనూ వెలుగు చూస్తున్న పరిస్థితి. ఇళాంటి వేళ.. ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోస్ వేసుకోవాల్సిన అవసరం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే.. ప్రస్తుతం బూస్టర్ డోస్ లేదంటే నాలుగో వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అయితే.. ఇక్కడో పాయింట్ ఉంది. బూస్టర్ డోస్ అక్కర్లేదు కానీ కొందరికి మాత్రం ఆ అవసరం ఉందంటున్నారు వైద్య నిపుణులు. అయితే.. అందుకు కొన్ని పరిమితులు ఉన్నాయి.

- 60 ఏళ్లు పైబడిన వారు

- తీవ్రమైన వ్యాధులతో బాధ పడుతున్న వారు

- ఇప్పటికి వ్యాక్సిన్ తీసుకొని వారు

ఇలాంటి కోవకు చెందిన వారు తప్పించి.. మిగిలిన వారికి నాలుగో వ్యాక్సిన్ అవసరం లేదని స్పస్టం చేస్తున్నారు. జేఎన్1 వేరియంట్ లక్షణాల్ని చూస్తే.. జ్వరం.. ముక్కు కారటం.. దగ్గు.. కొన్నిసార్లు విరేచనాలు.. తీవ్రమైన బాడీ పెయిన్స్ లాంటి ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటారు. అయితే.. వీటన్నింటి నుంచి వారంలో కోలుకునే వీలుంది. ఆదివారం నమోదైన 656 కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,742కు చేరుకుంది. అయితే.. ఈ వేరియంట్ బారిన పడిన వారిలో అత్యధికులు ఇంట్లో ఉండి కోలుకునే వీలుంది. చాలా తక్కువ మంది మాత్రమే ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి ఉందంటున్నారు.