Begin typing your search above and press return to search.

కరోనా మందులతో సైడ్‌ ఎఫెక్ట్‌... బ్లూ కలర్‌ లో చిన్నారి కళ్లు!

ఈ విషయాలపై స్పందించిన వైద్యులు.. మెడికల్ సైడ్ ఎఫెక్ట్స్ లో అసాధారణ సందర్బాల్లో మాత్రమే ఇలా జరుగుతుందని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   7 Sep 2023 1:45 PM GMT
కరోనా మందులతో సైడ్‌  ఎఫెక్ట్‌... బ్లూ కలర్‌  లో చిన్నారి కళ్లు!
X

గత మూడేళ్లుగా కోవిడ్-19 ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే గతంలో విశ్వరూపాన్ని చూపించిన ఈ కరోనా మహమ్మారి... ఇప్పటికీ తన రూపాన్ని మార్చుకుంటూ ప్రజలపై దాడి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా కోవిడ్ సోకిన వారు దీర్ఘకాలం సైడ్ ఎఫెక్టులతో బాధపడుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

చిన్న వయసులోనే హార్ట్ అటాక్ లు రావడానికి కూడా కరోనా వ్యాక్సిన్ కారణం అంటూ కొన్ని కథనాలు ఆన్ లైన్ వేదికగా చెక్కర్లు కొట్టాయి. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా థాయిలాండ్ లో కోవిడ్ చికిత్స తర్వాత ఓ చిన్నారి కళ్ల రంగు పూర్తిగా మారిపోయిన విషయం ఇప్పుడు వైరల్ గా మారుతుంది.

అవును... తాజాగా కోవిడ్ చికిత్స అనంతరం థాయిలాండ్ లో ఒక చిన్నారి కళ్లు నీలంగా మారిపోయాయి. ఈ విషయాలపై స్పందించిన వైద్యులు.. మెడికల్ సైడ్ ఎఫెక్ట్స్ లో అసాధారణ సందర్బాల్లో మాత్రమే ఇలా జరుగుతుందని చెబుతున్నారు.

థాయిలాండ్ కి చెందిన బాలుడు ఒక రోజు జ్వరం, దగ్గులో బాధపడుతుంటే ఆస్పత్రికి తీసుకెళ్లిన పేరెంట్స్ పరీక్ష చేయించగా కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. దీంతో చికిత్స కోసం ఫావిపిరావిర్ అనే మందును వాడారు వైద్యులు. అనంతరం ఆ శిశువు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది.

అయితే ఈ మందును వాడిన 18 గంటల తర్వాత పిల్లాడి కంటి రంగు మారడాన్ని తల్లి గమనించిందట. 6 నెలల ఈ బాలుడి కళ్లు ముదురు గోధుమ రంగు నుంచి నీలం రంగులోకి మారిపోయాయి. ఈ క్రమంలో ఫావిపిరావిర్ ఆపేసిన 5 రోజుల తర్వాత బాలుడి అసలు కళ్ల రంగులోకి వచ్చాయి. అయితే చర్మం, గోళ్లు, నోరు, ముక్కు మాత్రం నీలిరంగులోకి మారడం కనిపించలేదట.

కాగా... 2022లో థాయిలాండ్ ప్రజారోగ్య మంత్రిత్వశాఖ కోవిడ్-19 తేలికపాటి లక్షణాలు ఉన్న పిల్లల చికిత్స కోసం యాంటివైరల్ ఔషధం ఫావిపిరావిర్ ని ఉపయోగించాలని ఆదేశించింది. ఓ మోస్తరు వ్యాధి లక్షణాలు ఉన్న వారికి, పిల్లలకు ఈ మందు వాడాలని సూచించింది.