Begin typing your search above and press return to search.

దేశంలో సంతాన సామర్థ్యం తగ్గుతోందా?

పెళ్లయి ఒక సంవత్సరం పూర్తయిన తరువాత సంతానం కలగకపోతే సంతాన లేమిగానే గుర్తిస్తారు.

By:  Tupaki Desk   |   22 March 2024 11:30 PM GMT
దేశంలో సంతాన సామర్థ్యం తగ్గుతోందా?
X

పెళ్లయి ఒక సంవత్సరం పూర్తయిన తరువాత సంతానం కలగకపోతే సంతాన లేమిగానే గుర్తిస్తారు. దేశంలో సంతాన లేమి సమస్య నానాటికి పెరుగుతోంది. సంతానోత్పత్తి రేటు తగ్గిపోతోంది. ఫలితంగా జంటలు వంధత్వం బారిన పడుతున్నారు. దీంతో జనాభా పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒక మనదేశంలోనే కాదు ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా కూడా అధికమవుతోంది. ఈనేపథ్యంలో జనాభా పెరుగుదల మెల్లమెల్లగా క్షీణిస్తోంది.

ప్రపంచంలోనే అధిక జనాభాగా గుర్తింపు పొందిన చైనా ఇప్పుడు రెండో స్థానానికి దిగజారిపోయింది. ఇప్పుడు అక్కడ జనాభా నియంత్రణ చర్యలు అవసరం లేదని చెబుతోంది. అయినా సమస్య కొలిక్కి రావడం లేదు. 1950లో 6.2 గా ఉన్న ఫెర్టిలిటీ రేటు 2021 నాటికి 2 కంటే దిగువకు పడిపోవడం గమనార్హం. దీంతో జనాభా పెరుగుదల క్షీణిస్తూ పోతోంది.

1950లో సగటున స్త్రీలలో టోటల్ ఫెర్టిలిటీ రేటు 4.5 శాతం కంటే ఎక్కువగా ఉండేది. అది ప్రస్తుతం 2.2కు దిగజారిపోయింది. ఈనేపథ్యంలో సంతాన లేమి సమస్య వెంటాడుతోంది. చాలా మంది జంటలు సంతాన లేమి సమస్యను ఎదుర్కొంటున్నాయి. 2021లో దాని రేటు 2.2కు తగ్గడం బాధాకరమే. ఈ క్రమంలో సంతాన భాగ్యం కలగని వారి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది.

సంతానోత్పత్తి రేటు 2050లో 1.29 శాతం, 2100 నాటికి 1.04 శాతానికి పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. రోజురోజుకు సంతాన లేమి సమస్య ఎక్కువవుతూనే ఉంది. ఇది నానాటికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా జంటలు వంధత్వ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీనికి చాలా రకాల కారణాలు ఉంటున్నాయి. దీంతో ఫెర్టిలిటీ ఓ పెద్ద సవాలుగానే మారుతోంది.

చాలా దేశాల్లో వివాహాలు చేసుకోవడం ఆలస్యమవుతోంది. ఫలితంగా సంతాన భాగ్యం కలగడం లేదు. ముందు జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలనే ఉత్సాహంతో ఉంటున్నారు. దీంతోనే జంటలు సంతానానికి నోచుకోవడం లేదని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో సంతాన లేమి సమస్యను తొలగించుకోవాలంటే పలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.