Begin typing your search above and press return to search.

ఎయిడ్స్ కు చికిత్స రాబోతోందా?

ప్రపంచంలో మందులు లేని రోగాలు రెండే. ఒకటి క్యాన్సర్. ఇంకోటి ఎయిడ్స్. ఈ రోగాలతో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం సహజమే.

By:  Tupaki Desk   |   22 March 2024 9:43 AM GMT
ఎయిడ్స్ కు చికిత్స రాబోతోందా?
X

ప్రపంచంలో మందులు లేని రోగాలు రెండే. ఒకటి క్యాన్సర్. ఇంకోటి ఎయిడ్స్. ఈ రోగాలతో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం సహజమే. ముందస్తుగా వ్యాధిని గుర్తిస్తే కొంత కాలం బాధలు లేకుండా జీవించొచ్చు. వ్యాధి ముదిరితే ప్రాణాలకు ప్రమాదమే. ఈనేపథ్యంలో క్యాన్సర్, ఎయిడ్స్ రోగాలు మానవ మనుగడకే ముప్పుగా వాటిల్లాయి. దీంతో వాటిని ముందే గుర్తించి సరైన చికిత్సలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని గుర్తించుకోవాలి.

ప్రస్తుతం ఎయిడ్స్ నియంత్రణలోకి తీసుకొచ్చారు. ఎయిడ్స్ కు చికిత్స అందుబాటులోకి రానుంది. తాజాగా సైంటిస్టులు crispr (క్లస్టర్ రెగ్యులర్లీ ఇంటర్ స్పేస్ డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్ ) సాంకేతికతతో కణాల నుంచి హెచ్ఐవీని తొలగించే వీలుందని గుర్తించారు. జీన్ ఎడిటింగ్ టెక్నాలజీతో వైరస్ సోకిన జన్వులను కత్తిరించి తీసేస్తారు. దీనిపై పరిశోధణలు జరుగుతున్నాయి.

దీర్ఘకాలంలో హెచ్ఐవీకి చికిత్స సాధ్యమవుతుందని పరిశోధకలు చెబుతున్నారు. ఎయిడ్స్ కు చికిత్స అందుబాటులోకి వస్తే ఇక భయపడాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్లు ఎయిడ్స్ కు మందు లేదనే భయంతోనే బతికారు. ఇప్పుడు చికిత్స రావడంతో ఇక ఎయిడ్స్ వచ్చినా ఎలాంటి ఆందోళన అవసరం లేదని అంటున్నారు. వ్యాధి బారిన పడినా కంగారు పడాల్సిన పని ఉండదు.

ఆఫ్రికాలో ఓ చింపాంజీ నుంచి మనిషికి వ్యాపించింది ఎయిడ్స్. వేగంగా విస్తరించి ప్రపంచాన్నే గడగడలాడించింది. 80వ దశకంలో వెలుగు చూసిన ఎయిడ్స్ ప్రజలందరిని ఆందోళనకు గురిచేసింది. అప్పట్లో ఈ వ్యాధి గురించి అందరు భయపడ్డారు. ఇప్పుడు వ్యాధి దాదాపు కనుమరుగు అయింది. దాని ఆనవాళ్లు కూడా కనిపించని పరిస్థితిలో దానికి మందు కనుగొనడం ఆహ్వానించదగినదే.

హెచ్ఐవీకి చికిత్స రావడం నిజంగా వైద్య పరిభాషలో మంచి పరిణామమే. సైంటిస్టులు ఎయిడ్స్ కు మందు కనుగొనడం విశేషమే. ఇక భవిష్యత్ లో కూడా ఎయిడ్స్ అంటే భయం ఉండదు. సులభంగా చికిత్స మార్గాలు రావడంతో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు. వైద్య రంగం సాధిస్తున్న డెవలప్ మెంట్ ఇలాంటి పరిణామాలకు దారి తీస్తుంది.