Begin typing your search above and press return to search.

15 నెలల పిల్లాడ్ని సేవ్ చేసేందుకు రూ.17కోట్ల ఇంజెక్షన్

చివరకు వారి స్థాయికి కొన్ని వేల రెట్లు ఎక్కువైన రూ.17 కోట్లు పలికే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ ఇస్తే కానీ బతికించలేమన్న మాట వైద్యుల నోట వచ్చింది.

By:  Tupaki Desk   |   18 Dec 2023 4:24 AM GMT
15 నెలల పిల్లాడ్ని సేవ్ చేసేందుకు రూ.17కోట్ల ఇంజెక్షన్
X

అభంశుభం తెలియని పదిహేను నెలల చిన్నారికి అరుదైన వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. అతడ్ని కాపాడుకునేందుకు అతడి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ప్రయత్నించారు. చివరకు వారి స్థాయికి కొన్ని వేల రెట్లు ఎక్కువైన రూ.17 కోట్లు పలికే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ ఇస్తే కానీ బతికించలేమన్న మాట వైద్యుల నోట వచ్చింది. ఇలాంటివేళ.. విరాళాల కోసం ప్రయత్నించి.. ఎట్టకేలకు ఆ ఇంజెక్షన్ ను బాధిత శిశువుకు ఇచ్చిన వైనం యూపీలో చోటు చేసుకుంది.

ఉత్తరప్రదేశ్ లోని సహారన్ పుర్ కు చెందిన 15 నెలల బాలుడు భూదేవ్. ఈ చిన్నారికి స్పైనల్ మస్కులర్ అట్రోఫి టైప్ 1 అనే అరుదైన వ్యాధి సోకింది. దీనికి చికిత్సగా ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఇంజెక్షన్లలో ఒకటైన రూ.17కోట్లు విలువైన సూది మందు అవసరమైంది. చిన్నారి తల్లిదండ్రులు అత్యంత నిరుపేదలు. ఇలాంటి వేళ.. ఈ పిల్లాడ్ని కాపాడేందుకు ఆన్ లైన్ లో క్యాంపైన్ జరిగింది.

దీనికి సానుకూల స్పందన లభించింది. అంతేకాదు.. ప్రముఖ ఫార్మా కంపెనీ నొవార్టిస్ అండగా నిలిచింది. ఆన్ లైన్ లో స్పందనతో పాటు.. నొవార్టిస్ సంస్థ కూడా అతడికి సాయం చేయటానికి అండగా నిలిచింది. అదే సమయంలో ప్రభుత్వం సైతం దిగుమతి సుంకంలో రాయితీ ఇచ్చింది. దీంతో.. రూ.17 కోట్ల విలువ ఉన్న ఇంజెక్షన్ విలువ రూ.10కోట్లకు దిగి వచ్చింది. తాజాగా ఆ ఖరీదైన ఇంజెక్షన్ ను ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు బాలుడికి ఇచ్చారు. ప్రస్తుతం ఆ పిల్లాడ్ని ఐసోలేషన్ లో ఉంచి వైద్యులు అబ్జర్వేషన్ లో ఉంచారు. ఇప్పటికైనా ఆ పిల్లాడు మామూలు కావాలని కోరుకుందాం.