Begin typing your search above and press return to search.

పెరుగుతున్న జోంబీ డీర్ డిసీజ్... మానవాళికి మరో ముప్పు!!

ఉత్తర అమెరికాలోని వన్యప్రాణులకు ఈ క్రానిక్ వేస్టింగ్ డిసీజ్ వ్యాపిస్తూ ఉండగా... ఇది మనుషులకు కూడా వ్యాపించే అవకాశాలు ఉన్నాయని అమెరికాలోని పరిశోధకులు హెచ్చరించినట్లు తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   20 Feb 2024 11:03 AM GMT
పెరుగుతున్న  జోంబీ డీర్  డిసీజ్... మానవాళికి మరో ముప్పు!!
X

ప్రపంచం అన్ని రంగాల్లోనూ ఎంత గొప్పగా అభివృద్ధి చెందుతుందో.. సరికొత్త వ్యాధులు సైతం రక రకాల రూపాల్లో అదేస్థాయిలో మానవాళిగా సవాళ్లు విసురుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా మానవాళిని ఎంతగా బాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇంకా ఆ మహమ్మారి ప్రజలను టెన్షన్ పెడుతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా మరోవ్యాధి తెరపైకి వచ్చింది.

అవును... నిన్నమొన్నటివరకూ కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని.. ఈ మహమ్మారి దాటికి చిగురుటాకులా వణికిన ప్రపంచం ఇప్పుడు మరో వైరస్ నుంచి ముప్పు ఎదుర్కునే అవకాశాలున్నాయని అంటున్నారు. ఆ వైరస్ పేరు... "జోంబీ డీర్". ప్రస్తుతం జంతువులకు పరిమితమైన ఈ వైరస్.. ప్రజలకు సోకడం మొదలైతే తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు.

ఉత్తర అమెరికాలోని వన్యప్రాణులకు ఈ క్రానిక్ వేస్టింగ్ డిసీజ్ వ్యాపిస్తూ ఉండగా... ఇది మనుషులకు కూడా వ్యాపించే అవకాశాలు ఉన్నాయని అమెరికాలోని పరిశోధకులు హెచ్చరించినట్లు తెలుస్తుంది. ఈ డిసీజ్ ను "జోంబీ డీర్ డిసీజ్" అని కూడా పిలుస్తారు. ఈ వైరస్ కారణంగా జంతువులు వింత వింతగా ప్రవర్తించడంతోపాటు వాటి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది.

వాస్తవానికి గత ఏడాది నవంబర్ నెలలో ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్‌ లో మొదటిసారిగా ఈ వైరస్ ను గుర్తించినట్లు చెబుతున్నారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వివరాల ప్రకారం... ఈ వ్యాధి అమెరికాలోని సుమారు 31 రాష్ట్రాల్లో నివేదించినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా... ప్రధానంగా ఉత్తర అమెరికా, కెనడా, నార్వే వంటి ప్రాంతాల్లోని జింక, దుప్పి, లేడి వంటి జంతువుల్లో ప్రబలంగా ఉన్నట్లు తెలుస్తుంది.

జోంబీ డీర్ డిసీజ్ అంటే...?

క్రానిక్ వేస్టింగ్ డిసీజ్ (సీ.డబ్ల్యూ.డీ.) అని కూడా పిలువబడే "జోంబీ డీర్ డిసీజ్" అనేది ఒక అంటువ్యాధి కాగా.. ప్రాణాంతకమైన వ్యాది కూడా! ఇది సాధారణంగా... జింక, లేడి, దుప్పి వంటి జంతువుల సమూహంలో కనిపించే వ్యాధి. ఇది మెదడు, ఇతర నాడీ వ్యవస్థలో పేరుకుపోయి ఉన్నపలంగా శారీరక, మానసిక క్షీణత ఏర్పడి చివరికి మరణానికి కారణమవుతుంది.

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వివరాల ప్రకారం... ఒక జింకలో ఈ లక్షణాలు అభివృద్ధి చెందడానికి ఒక ఏడాది కాలం పట్టవచ్చని చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ వైరస్ సోకిన జింక సడన్ గా బరువును కోల్పోవడం, మొత్తం నీరసించిపోవడం వంటి లక్షణాలు కలిగి ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం దీనికి ఎటువంటి నివారణ లేదా వ్యాక్సిన్ అందుబాటులో లేదని సమాచారం!

ప్రస్తుతానికి మానవునిలో ఈ జోంబీ డీర్ వ్యాధికి సంబంధించిన కేసులు నివేదించబడలేదు కానీ... బ్రేక్‌ అవుట్‌ ల విషయంలో సిద్ధంగా ఉండాలని శాస్త్రవేత్తలు ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నారని తెలుస్తుంది.