Begin typing your search above and press return to search.

యంగ్ హీరో ముందు జాగ్ర‌త్త‌.. డైరెక్ట‌ర్ ఔట్‌

ఈ మ‌ధ్య ఏ హీరోని గ‌మ‌నించినా ప‌క్కా ప్లాన్‌తో ప్రేక్ష‌కులు మెచ్చే సినిమాలు చేయాల‌ని ఆలోచిస్తున్నారు.

By:  Tupaki Desk   |   1 Sep 2023 3:51 AM GMT
యంగ్ హీరో ముందు జాగ్ర‌త్త‌.. డైరెక్ట‌ర్ ఔట్‌
X

ఈ మ‌ధ్య ఏ హీరోని గ‌మ‌నించినా ప‌క్కా ప్లాన్‌తో ప్రేక్ష‌కులు మెచ్చే సినిమాలు చేయాల‌ని ఆలోచిస్తున్నారు. అందు కోసం ఎలాంటి మార్పులు చేర్పులు చేయ‌డానికైనా వెనుకాడ‌టం లేదు. ఈ విష‌యంలో ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల మాట‌ల‌ని కూడా లెక్క చేయ‌కుండా తాము అనుకున్న ఔట్ పుట్ కోసం రాజీ ప‌డ‌టం లేదు. బిగ్ స్టార్స్ నుంచి చోటా మోటా హీరోల వ‌ర‌కు ఇదే ఫార్ములాని అనుస‌రిస్తున్నారు. అవ‌స‌రం అనుకుంటే డైరెక్ట‌ర్ల‌ని కూడా మార్చేస్తున్నారు.

శేఖ‌ర్ క‌మ్ముల స్కూల్ నుంచి న‌టుడిగా ప‌రిచ‌య‌మైన ఓ యంగ్ హీరో ప‌క్కా కామెడీ క‌థ‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. దీంతో ఒక్క‌సారిగా ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు. ఆ వెంట‌నే త‌న‌కంటే సీనియ‌ర్ హీరోయిన్‌తో స్టాండ‌ప్ కామెడీ నేప‌థ్యంలో రూపొందిన క్రేజీ సినిమాతో త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. రెండేళ్ల విరామం త‌రువాత ఈ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న యంగ్ హీరో ఇక‌పై సినిమాల విష‌యంలో ఆల‌స్యం కాకూడ‌ద‌ని ఏడాదికి ఒక‌టి లేదా వీలైతే రెండు సినిమాల‌తో రావాలని ఫిక్స‌య్యాడ‌ట‌.

అందులో భాగంగానే త‌ను న‌టించిన సినిమా రిలీజ్ కాకుండా మ‌రో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాడు. దీన్ని కూడా పేరున్న నిర్మాత నిర్మిస్తున్నాడు. క్రేజీ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు స‌ద‌రు హీరోనే మంచి బ‌జ్‌ని కూడా క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఇంత వ‌ర‌కు జ‌రిగిన షూటింగ్ విష‌యంలో మాత్రం హీరో హ‌ర్ట్ అయ్యాడ‌ట‌. అనుకున్న విధంగా సినిమా రాలేద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశాడ‌ట‌. ఆ కార‌ణంగానే ద‌ర్శ‌కుడిని త‌ప్పించాడ‌ని, దీంతో ఈ సినిమా మ‌ధ్య‌లోనే ఆగిపోయింద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

హీరో మాట‌ని కాద‌న‌లేని నిర్మాత అత‌న్ని త‌ప్పించ‌డ‌మే కాకుండా అత‌నికి మ‌రో సినిమాని డైరెక్ట్ చేసే అవ‌కాశం ఇచ్చాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతే కాకుండా ఈ సినిమాని రీ షూట్‌లు చాలా అవ‌సరం ఉంద‌ట‌. మ‌రి మ‌ధ్య‌లో సినిమాని టేక‌ప్ చేసే ద‌ర్శ‌కుడు ఎవ‌రు? అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే మ‌ధ్య‌లో ఆగిన సినిమాని మ‌ళ్లీ ప‌ట్టాలెక్కించే ద‌ర్శ‌కుడి కోసం యంగ్ హీరో, నిర్మాత అన్వేష‌ణ మొద‌లు పెట్టిన‌ట్టుగా ఇన్ సైడ్ టాక్‌.