Begin typing your search above and press return to search.

వాళ్ల ఆన్ స్క్రీన్ రొమాన్స్ కోసం వీళ్లు ఈగర్ గా వెయిటింగ్..!

అయితే రష్మికతో మళ్లీ నటించడం జరిగితే అది ఇద్దరి కెరీర్ కి మరో బెస్ట్ హిట్ ఇచ్చే కథ అయితేనే చేయాలని అనుకుంటున్నారట.

By:  Tupaki Desk   |   27 July 2023 11:19 AM GMT
వాళ్ల ఆన్ స్క్రీన్ రొమాన్స్ కోసం వీళ్లు ఈగర్ గా వెయిటింగ్..!
X

హీరో హీరోయిన్ కాంబినేషన్ లో హిట్ పడినా.. ఆ ఇద్దరి కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయినా ఆడియన్స్ కి ఆ జోడీ మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ప్రస్తుతం అలాంటి జోడీ ఎవరు అంటే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న అని తెలిసిందే. గీత గోవిందంతో ఇద్దరు సూపర్ హిట్ కొట్టగా ఆ సినిమాతో ఇద్దరికి స్టార్ డం వచ్చింది. ఆ సినిమా టైం లోనే క్లోజ్ అయిన వారిద్దరు డియర్ కామ్రెడ్ తో మరోసారి జత కట్టే సరికి ఇంకాస్త క్లోజ్ అయ్యారు. విజయ్ దేవరకొండ రష్మిక ల డియర్ కామ్రేడ్ కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు కానీ వీళ్ల రిలేషన్ షిప్ ని స్ట్రాంగ్ చేసిందని తెలుస్తుంది.

విజయ్ రష్మిక ఇద్దరి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ జరుగుతుందని అందరు చెప్పుకుంటున్నారు. ఇద్దరు కలిసి సీక్రెట్ గా హాలిడే ట్రిప్ కి వెళ్లడం.. కలిసి తిరగడం అన్నీ తెలుస్తున్నా ఇద్దరు కూడా తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదన్నట్టుగానే ప్రవర్తిస్తుంటారు.

అంతేకాదు విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమాలకు రష్మిక డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తూ వస్తుంది. అయితే వీరిద్దరి ఆఫ్ స్క్రీన్ రిలేషన్ షిప్ ఏదైనా మళ్లీ వీరిద్దరిని కలిసి ఆన్ స్క్రీన్ పై చూడాలని రౌడీ ఫ్యాన్స్ కోరుతున్నారు.

విజయ్ తో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ రెండు సినిమాలు చేసిన రష్మిక ఆ తర్వాత మళ్లీ జత కట్టలేదు. విజయ్ రష్మికలను కలిసి మళ్లీ తెర మీద చూడాలని ఫ్యాన్స్ తెగ ఆరాటపడుతున్నారు. అయితే రష్మికతో మళ్లీ నటించడం జరిగితే అది ఇద్దరి కెరీర్ కి మరో బెస్ట్ హిట్ ఇచ్చే కథ అయితేనే చేయాలని అనుకుంటున్నారట.

విజయ్ చెబితే తన సినిమాలో రష్మిక చేస్తానంటుంది కానీ ఇద్దరి జోడీకి కొంత క్రేజ్ ఉంది కాబట్టి దానికి తగినట్టుగా కథ కోసం ఎదురుచూస్తున్నారట.

ప్రస్తుతం విజయ్ ఖుషి చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత పరశురాం తో సినిమా సెట్స్ మీద ఉంది. ఆ సినిమాలో ఆల్రెడీ మృణాల్ తో రొమాన్స్ చేస్తున్నాడు. ఇక మరోపక్క గౌతం తిన్ననూరి సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా ఓకే అయ్యింది.

ఈ రెండు సినిమాల తర్వాత విజయ్ చేసే సినిమాకు ఏమైనా రష్మిక పనిచేసే అవకాశం ఉంది. మరి ఆ సినిమా ఎవరి డైరెక్షన్ లో వస్తుంది. విజయ్ రష్మిక ఈసారి ఎలాంటి కథతో వస్తారన్నది చూడాలి.