Begin typing your search above and press return to search.

సుకుమార్- షారుక్.. ఇప్పుడు జరిగే పనేనా?

పెద్ది తర్వాత చరణ్.. త్రివిక్రమ్ తో వర్క్ చేసే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ విషయంపై కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   11 Jun 2025 10:30 PM
సుకుమార్- షారుక్.. ఇప్పుడు జరిగే పనేనా?
X

టాలీవుడ్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్, బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కాంబినేషన్ లో సినిమా.. గత కొద్ది రోజులుగా బీటౌన్ వర్గాల్లో ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది. తెలుగు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందించనుందని... త్వరలో మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని.. ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

కానీ సుకుమార్- షారుక్ మూవీ విషయంలో నిజమెంత ఉందనేది మాత్రం క్లారిటీ లేదు. అయితే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ షారుక్ ఖాన్ తో టచ్ లో ఉందని తెలుస్తోంది. కేవలం చర్చలు జరిగాయట. కానీ అవి కూడా ఇంకా ప్రారంభ దశలో ఉన్నాయని సమాచారం. ఇంకా సినిమా విషయంలో ఏ విధంగా కూడా ఖరారు కాలేదని వినికిడి.

అదే సమయంలో పుష్ప-2తో వేరే లెవెల్ హిట్ అందుకున్న సుకుమార్.. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా వర్క్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేస్తున్నారు. అలా సుకుమార్ ఫోకస్ అంతా RC 17 ప్రాజెక్ట్ పై ఉందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. వచ్చే ఏడాది సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

ఎందుకంటే.. స్క్రిప్ట్ ను ఖరారు చేయడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కు ఏడు- ఎనిమిది నెలల సమయం పట్టవచ్చు. దీంతో సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఏడాది టైమ్ ఉంది. అదే సమయంలో ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న పెద్ద సినిమాతో ఇప్పుడు చరణ్ బిజీగా ఉన్నారు.

పెద్ది తర్వాత చరణ్.. త్రివిక్రమ్ తో వర్క్ చేసే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ విషయంపై కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. సుకుమార్ సినిమా కన్నా ముందే ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు టాక్. మరోవైపు.. షారుక్ ఖాన్ ఇప్పుడు తన భారీ బడ్జెట్ కింగ్ తో బిజీగా ఉన్నారు. తన అప్ కమింగ్ మూవీపై కంప్లీట్ ఫోకస్ పెట్టారు.

దీనిబట్టి చూస్తే.. అన్నీ ఓకే అయితే సుకుమార్ తో షారుక్ వర్క్ చేయడానికి సిద్ధమైనా ఇప్పుడు తెరకెక్కే అవకాశం లేదు. అందుకు చాలా టైమ్ పడుతుంది. అది కూడా 2027 లోపు సాధ్యం కావడం కష్టమే. కాబట్టి ఇప్పుడు వస్తున్న సుకుమార్- షారుక్ ఖాన్ ప్రాజెక్ట్ కేవలం ఊహాగానాలు! మరేం జరుగుతుందో.. షారుక్, సుకుమార్ మూవీ ఫ్యూచర్ లో ఎప్పుడు తెరకెక్కుతుందో వేచి చూడాలి.