Begin typing your search above and press return to search.

నిర్మాత‌తో హీరో వివాదం..త‌గ్గేదేలే!

దీంతో శాండిల్ వుడ్ లో సీన్ వెడెక్కుతున్న‌ట్లే క‌నిపిస్తోంది. సుదీప్ వ్య‌తిరేకులంతా కుమార్ కి మ‌ద్ద‌తుగా నిలుస్తున్న‌ట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   19 July 2023 11:01 AM GMT
నిర్మాత‌తో హీరో వివాదం..త‌గ్గేదేలే!
X

క‌న్నడ న‌టుడు సుదీప్ పై ఇటీవ‌లే నిర్మాత ఎంఎన్ కుమార్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. త‌న ద‌గ్గ‌ర డ‌బ్బులు తీసుకుని సినిమా చేయ‌మంటే త‌ప్పించుకుని తిరుగుతున్నాడ‌ని మీడియాకి ఎక్క‌డం సంచ‌ల‌మైంది. దీంతో నెట్టింట సుదీప్ పై నెగిటివిటీ తారా స్థాయికి చేరింది. సుదీప్ ఇలాంటి ప‌నులు కూడా చేస్తాడా? డ‌బ్బులు తీసుకుని నిర్మాత‌ల్ని మోసం చేస్తున్నాడా? అంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్లు వైర‌ల్ అయ్యాయి.

అయితే ఇన్ని రోజులు మౌనం వ‌హించిన సుదీప్ తాజాగా ఈ అంశంపై స్పందించాడు. ఈ వివాదంపై న్యాయ పోరాటానికి దిగుతున్న‌ట్లు సుదీప్ ప్ర‌క‌టించాడు. ఈ వ్య‌వ‌హారమంతా కోర్టులోనే తేల్చుతాన‌ని తెలిపాడు.

దీంతో స‌ద‌రు నిర్మాత మ‌రోసారి బెంగుళూరు ఫిలింఛాంబ‌ర్ ముందు భైటాయించాడు. 48 గంట‌ల పాటు ద‌ర్నా చేప‌ట్టాడు. ఒక్క‌రితో మొద‌లైన వివాదం న‌ల‌భై..యాభై మంది వ‌ర‌కూ ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా దిగారు.

వారిలో సారా గోవింద్ లాంటి ప్ర‌ముఖులున్నారు. దీంతో శాండిల్ వుడ్ లో సీన్ వెడెక్కుతున్న‌ట్లే క‌నిపిస్తోంది. సుదీప్ వ్య‌తిరేకులంతా కుమార్ కి మ‌ద్ద‌తుగా నిలుస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో గోటీతో పోయేదాన్ని గొడ్డ‌లి దాకా తెచ్చుకుంటు న్నారంటూ సుదీప్ తీరుని ఉద్దేశించి మ‌రోసారి నెట్టింట కామెంట్లు మొద‌ల‌య్యాయి. చిన్న వివాదాన్ని సుదీప్ సాగ‌దీసి ర‌చ్చ చేస్తున్నాడంటూ కామెంట్లు ద‌ర్శ‌న‌మి స్తున్నాయి.

దీనికి తోడు నిన్న‌టి రోజును సుదీప్ రాజ‌స్తాన్ రాయ‌ల్స్ టీమ్ కి పార్టీ ఇచ్చిన ఫోటోలో నెట్టింట వైర‌ల్ అవ్వ‌డంతో సీన్ మ‌రింత వెడెక్కింది. ప‌రిశ్ర‌మ‌లో ఇంత జ‌రుగుతున్నా ఆయ‌న స్పందించ‌కుండా ఇలాంటి పార్టీల‌కు అంకిత‌మ‌వుతాడా? అంటూ కొంత మంది ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు సుదీప్ తీరును ప్ర‌శ్నిస్తున్నారు.

దీనిపై నిర్మాత‌ల మండ‌లి కూడా ఎలాంటి కామెంట్ చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే సుదీప్ కోర్టును ఆశ్ర‌మించిన నేప‌థ్యంలో ఇలా భైటాయించ‌డం అన్న‌ది విరుద్ద‌మే అవుతుంది. ప్ర‌స్తుతం సుదీప్ ప‌లు సినిమాల‌తో బిజీగా ఉన్నారు.