Begin typing your search above and press return to search.

షూట్ ముగియ‌కుండానే 120కోట్ల డీల్.. ఖాన్ వార‌సుడా మ‌జాకానా?

కింగ్ ఖాన్ షారూఖ్ వార‌సుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నాడు.

By:  Tupaki Desk   |   10 Aug 2023 12:30 AM GMT
షూట్ ముగియ‌కుండానే 120కోట్ల డీల్.. ఖాన్ వార‌సుడా మ‌జాకానా?
X

కింగ్ ఖాన్ షారూఖ్ వార‌సుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నాడు.నిజానికి అత‌డు తన తండ్రి.. సోదరి, షారుఖ్ ఖాన్ - సుహానా ఖాన్ లాగానే నటనతో పరిశ్రమలోకి అడుగుపెడతారని అనుకున్నారు. అయితే ఆర్యన్ ఆలోచ‌న‌లు అందుకు విరుద్ధంగా మ‌రింత‌ ఆసక్తికరంగా ఉన్నాయి. అత‌డు ఇప్పుడు ద‌ర్శ‌కుడు కావాల‌ని ప‌ట్టుబ‌డుతున్నాడు. ఆ దిశ‌గా ప్ర‌య‌త్నంలో ఉన్నాడు. `స్టార్‌డమ్` అనే వెబ్ సిరీస్‌తో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ సిరీస్ ఇంకా బయటకు రాకముందే ప‌లు OTT దిగ్గజాలు ఆర్యన్‌కు భారీ మొత్తాన్ని ఆఫ‌ర్ చేస్తున్నాయ‌ని తెలిసింది. దాదాపు రూ.120 కోట్ల మేర బిజినెస్ డీల్ మాట్లాడుతున్నార‌ని కూడా తెలుస్తోంది.

నిజానికి ఒక డెబ్యూ తెర‌కెక్కించిన‌ వెబ్ సిరీస్ కి ఇంకా పూర్తి కాకముందే 120 కోట్ల రూపాయల భారీ ఆఫర్ వ‌చ్చింది అన‌గానే... అంతా షాక‌వుతున్నారు. ఆర్యన్ ఇంకా ఏ OTT ప్లాట్‌ఫారమ్‌కు వెబ్ సిరీస్ హక్కులను విక్రయించలేదు. సిరీస్ పూర్తయ్యే వరకు అమ్మ‌కాలు లేవ‌ని ఆర్యన్ చెబుతున్నాడు. అది ఆర్య‌న్ ధ‌ర్మ‌బ‌ద్ధ‌మైన ఆలోచ‌న‌కు అద్దం ప‌డుతోంది. OTT స్పేస్‌లో చాలా మంది ఇప్ప‌టికే ఆర్య‌న్ ని ఫిలింమేక‌ర్ గా ఆమోదించేందుకు అత‌డి ప్రొడ‌క్ట్ ని కొనుగోలు చేసేందుకు ఆస‌క్తిగా ఉండ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. సీజన్ 1 పూర్తికాకముందే చిత్రనిర్మాతలు భవిష్యత్ సీజన్‌ల కోసం సైన్ అప్ చేస్తున్నారని, అయితే ఆర్యన్ చాలా బ్యాలెన్సింగ్ గా ఆలోచిస్తున్నాడ‌ని తెలుస్తోంది. ఇంకా పోస్ట్-ప్రొడక్షన్, ఎడిటింగ్ స‌హా అన్నీ పూర్త‌య్యే వరకు అతడు త‌న వెబ్ సిరీస్ ని విక్రయించడు అని ఖాన్ కుటుంబానికి చెందిన‌ సన్నిహిత సోర్స్ ఒక‌రు వెల్ల‌డించారు.

డిసెంబర్ 2022లో ఆర్యన్ ఖాన్ `స్టార్‌డమ్` కోసం స్క్రిప్ట్ రాసుకున్నట్లు ప్రకటించాడు. పూర్తయిన స్క్రిప్ట్‌కు సంబంధించిన ఫోటోని కూడా షేర్ చేసాడు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోందని తెలిపారు. తాను స్క్రిప్ట్ రాయడం ముగించానని, యాక్షన్ క‌ట్ చెప్పడానికి వేచి ఉండలేనని ఆర్య‌న్ ఆ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చాడు. షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్, పూజా దద్లానీ తదితరులు నిర్మాత‌లుగా ఆర్య‌న్ కి పెద్ద అండ‌గా నిలిచారు.