Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరోతో రొమాన్స్ కి స‌మంత‌..త్రిష పోటీ!

ఆ స్టార్ హీరో కోసం స‌మంత‌-త్రిష పోటీ ప‌డుతున్నారా? ఛాన్స్ కోసం ఎవ‌రి వ్య‌క్తిగత ప్ర‌య‌త్నాలు వారు చేస్తున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   16 Sep 2023 4:35 AM GMT
ఆ స్టార్ హీరోతో రొమాన్స్ కి స‌మంత‌..త్రిష పోటీ!
X

ఆ స్టార్ హీరో కోసం స‌మంత‌-త్రిష పోటీ ప‌డుతున్నారా? ఛాన్స్ కోసం ఎవ‌రి వ్య‌క్తిగత ప్ర‌య‌త్నాలు వారు చేస్తున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఇంత‌కీ ఎవ‌రా స్టార్ హీరో! భామా మ‌ణులిద్ద‌రు అంత సీరియ‌స్ గా తీసుకున్న హీరో? ఎవ‌రు? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ క‌థానాయ‌కుడిగా త‌మిళ ద‌ర్శ‌కుడు విష్ణు వ‌ర్ధ‌న్ ఓ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే.

అందులో హీరోయిన్ గా ద‌క్షిణాది భామ‌నే తీసుకోవాల‌ని భాయ్ ఆదేశాలిచ్చారు. దీంతో విష్ణు వ‌ర్ద‌న్ హీరోయిన్ వేట మొద‌లు పెట్టారు. దీనిలో భాగంగా త్రిష‌..స‌మంత పేర్ల‌ను ప్ర‌ముఖంగా ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలిసింది. పాన్ ఇండియాలో గుర్తింపు ఉన్న హీరోయిన్ అయితే బాగుంటుంద‌ని ఇద్ద‌రిలో ఎవ‌ర్నీ తీసుకోవాలి అన్న అంశంపై మీమాంస కొన‌సాగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇద్ద‌రు లీడింగ్ లో ఉన్న భామ‌లు కావ‌డంతో ఈ క‌న్ ప్యూజన్ క్రియేట్ అవుతుంది.

ఇప్ప‌టికే త్రిష `క‌ట్టా మిట్టా`తో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. కానీ అక్క‌డ అమ్మ‌డు సక్సెస్ అవ్వ‌లేదు. ఆ సినిమా త‌ర్వాత మ‌రో హిందీ సినిమా చేయ‌లేదు. ఇక స‌మంత ఇటీవ‌లే బాలీవుడ్ సీరియ‌స్ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. `పుష్ప‌`లో ఐటం సాగ్ తో అమ్మ‌డు దేశాన్నే షేక్ చేసింది. అలాగే హిందీ టీవీ షోల్లోనూ చురుకుగా పాల్గొంటుంది. `సీటాడెల్` ఇండియ‌న్ వెర్ష‌న్ లో నూ న‌టిస్తోంది. ఓ ర‌కంగా చెప్పాలంటే త్రిష కంటే స‌మంత మెరుగ్గా క‌నిపిస్తోంది.

అలాగ‌ని త్రిష‌ని త‌క్కువ చేయ‌నికి లేదు. బ్యూటీతో అమ్మ‌డు ఫిదా చేస్తుంది. దీంతో స‌ల్మాన్ స‌ర‌స‌న ఛాన్స్ ఎవ‌రికి వ‌రిస్తుంది అన్న దానిపై స‌స్పెన్స్ కొన‌సాగుతుంది. అలాగే ఇద్ద‌రు వ్య‌క్తిగ‌తంగా ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారు చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇద్ద‌రు స్వ‌స్థ‌లం చెన్నై. కోలీవుడ్ లో మంచి ప‌రిచ‌యాలు ఉన్నాయి. విష్ణువ‌ర్ద‌న్ తో ఇప్ప‌టికే త్రిష ఓ సినిమా చేసింది. కానీ స‌మంత కి మాత్రం ఇంకా ఆఛాన్స్ రాలేదు. ఈ నేప‌థ్యంలో స‌ల్మాన్ తో ఛాన్స్ ఇస్తారని ఆశిస్తుంది. మ‌రి అంతిమంగా భాయ్ స‌ర‌స‌న మెరిసే నాయిక ఎవ‌రు? ఎవ‌రు అవుతారో చూడాలి.