Begin typing your search above and press return to search.

రాజ‌కీయాల్లోకి స‌మంత‌! సినిమాలు వ‌దిలేస్తుందా?

నటనకు విరామం తర్వాత సమంత రూత్ ప్రభు రాజకీయాల్లో చేరనున్నారా? అంటే అవున‌నే ప్ర‌చారం చేస్తోంది హిందీ మీడియా.

By:  Tupaki Desk   |   8 Sep 2023 11:30 AM GMT
రాజ‌కీయాల్లోకి స‌మంత‌! సినిమాలు వ‌దిలేస్తుందా?
X

నటనకు విరామం తర్వాత సమంత రూత్ ప్రభు రాజకీయాల్లో చేరనున్నారా? అంటే అవున‌నే ప్ర‌చారం చేస్తోంది హిందీ మీడియా. అయితే ఇది నిజ‌మా? అంటే మ‌రిన్ని వివ‌రాల్లోకి వెళ్లాలి.

కొద్దిరోజులుగా అనారోగ్య‌ కార‌ణాల‌తో విశ్రాంతి తీసుకుంటున్న సమంతా రూత్ ప్రభు సెప్టెంబ‌ర్ 1న‌ థియేటర్లలోకి వచ్చిన త‌న సినిమా `ఖుషి` విజ‌యాన్ని ఆస్వాధిస్తోంది. నిజానికి సామ్ ఖుషి ప్రాచారంలో పాలుపంచుకోలేక‌పోయింది. ఇటీవ‌లే అమెరికాలో మ‌యోసైటిస్ చికిత్స‌తో కొంత మెరుగైన అనంత‌రం తిరిగి హైద‌రాబాద్ లో అడుగుపెట్టింది. ఆ వెంట‌నే ముంబైకి వెళ్లింది. ముంబైకి ప‌య‌న‌మైన ఫోటోలు వీడియోలు కూడా వైర‌ల్ అయ్యాయి. అయితే స‌మంత త‌దుప‌రి ఏం చేయ‌బోతోంది? సినిమాల్లో న‌టిస్తుందా? లేక పూర్తిగా విరామానంత‌రం రాజ‌కీయాల్లో చేరుతుందా? అంటూ నెటిజ‌నుల్లో ఒక సెక్ష‌న్ డిబేట్లు ర‌న్ చేస్తోంది.

తన విరామం ముగిసిన తర్వాత సమంత రాజకీయ ప్రపంచంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నట్లు కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. సామ్ ఎప్పుడూ తెలంగాణ ప్రాంతంలోని రైతులకు బలమైన మద్దతుదారుగా ఉంటూ చేనేత కార్మికులు తయారు చేసే దుస్తులకు ప్ర‌చార‌క‌ర్త‌గా కూడా పనిచేశారు. సామ్ కి సంబంధించిన‌ అనేక కార్యకలాపాలు తెలంగాణ ప్రభుత్వానికి అనుసంధానించబడి ఉన్నాయి. ఈ ప్రాంతంపై స‌మంత‌కు ఉన్న అంకితభావానికి ఇవ‌న్నీ నిద‌ర్శ‌నం.

అందుకే స‌మంత త్వ‌ర‌లో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అనే రాజకీయ పార్టీ ప్రచారంలో చేరాలని ఆలోచిస్తున్నట్లు క‌థ‌నాలు వ‌స్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు. నిజానికి స‌మంత‌ రాజకీయాల్లోకి వచ్చే అవ‌కాశం ఉందా? అంటే ఒక సెక్ష‌న్ ర‌క‌ర‌కాలుగా ఊహిస్తోంది. స‌మంత న‌ట‌రంగంలో కొన‌సాగ‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని ఒక నెటిజ‌న్ వ్యాఖ్యానించగా త‌న‌కు రాజ‌కీయాలు సూట్ కావ‌ని కొంద‌రు వ్యాఖ్యానించారు. పైగా మ‌యోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకోని స‌మంత‌కు రాజ‌కీయాలు స‌రిప‌డ‌వ‌ని కూడా కొంద‌రు సూచిస్తున్నారు. మ‌యోసైటిస్ ప్రమాద‌క‌ర రుగ్మ‌త‌.. సూర్య ర‌శ్మి తాకితే చాలు ఒళ్లంతా నొప్పి ముఖం నొప్పి వంటి స‌మ‌స్య‌లు వెన్నాడుతాయి. ఇది ఆటోఇమ్యూన్ రుగ్మ‌త గ‌నుక త్వ‌ర‌గా కోలుకోవ‌డం కూడా సులువు కాదు.

మ‌రోవైపు సమంతా క్రమంగా హిందీ బెల్ట్‌లో కూడాయ ఎదిగేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అక్క‌డ ఇప్ప‌టికే గొప్ప‌ ప్రజాదరణ పొందుతోంది. ఊ అంటావా సాంగ్ ఘ‌న‌విజ‌యం త‌ర్వాత హిందీ సినిమాల్లో న‌టించేందుకు ప్లాన్ చేస్తోంద‌ని క‌థ‌నాలొచ్చాయి. అలాగే `సిటాడెల్` భారతీయ అనుసరణలో వ‌రుణ్ ధావన్‌తో కలిసి న‌టించింది. త్వ‌ర‌లో ఈ సిరీస్ స్ట్రీమింగుకి రానుంది. ఆ త‌ర్వాత కూడా బాలీవుడ్ లో న‌టించే ఉద్ధేశంతోనే ప్ర‌స్తుతం అక్క‌డ క‌మిట్ మెంట్ల‌పై దృష్టి సారించింద‌ని, అందుకే స‌మంత అమెరికా నుంచి రాగానే వెంట‌నే ముంబైకి ప‌య‌న‌మైంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.