Begin typing your search above and press return to search.

ఆ హీరో దర్శకత్వంలో ప్రభాస్?

ఈ టాలెంటెడ్ యాక్టర్ కమ్ దర్శకుడు రెబల్ స్టార్ ప్రభాస్ కి ఒక స్టొరీ నేరేట్ చేసాడంట.

By:  Tupaki Desk   |   26 July 2023 5:14 AM GMT
ఆ హీరో దర్శకత్వంలో ప్రభాస్?
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీలో చేస్తోన్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సెప్టెంబర్ 28న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. భారీ బడ్జెట్ తో హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మూవీలో ప్రభాస్ కి ప్రతినాయకుడిగా మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. సినిమాలో ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోంది.

సలార్ రెండు భాగాలలో కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర ఉండబోతోందని తెలుస్తోంది. 'పృథ్వీరాజ్ దర్శకుడు కూడా అనే సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు. మోహన్ లాల్ తో లూసీఫర్, బ్రో డాడీ సినిమాలు చేసి సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఈ రెండు సినిమాలు దేనికవే ప్రత్యేకం. ఈ టాలెంటెడ్ యాక్టర్ కమ్ దర్శకుడు రెబల్ స్టార్ ప్రభాస్ కి ఒక స్టొరీ నేరేట్ చేసాడంట.

గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఒక కథని పృథ్వీ రాజ్ ప్రభాస్ కి చెప్పడం జరిగినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే కథ బాగున్నా కూడా ప్రభాస్ ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదంట. పృథ్వీ రాజ్ ప్రస్తుతం మలయాళంలో ఒక పాన్ ఇండియా మూవీ చేసే ప్రయత్య్నంలో ఉన్నారు.

దాని తర్వాత ప్రభాస్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఒక వేళ ప్రభాస్ ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కూడా అంత వేగంగా స్టార్ట్ అయ్యే అవకాశాలు లేవని చెప్పాలి.

ప్రస్తుతం ప్రభాస్ లైన్ అప్ చూసుకుంటే వరుస సినిమాలు కనిపిస్తున్నాయి. కల్కి 2898 ఏడీ రిలీజ్ తర్వాత మారుతి మూవీ వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. దాని తర్వాత మరల సలార్ పార్ట్ 2పై ఫోకస్ పెట్టాలి. దాంతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు.

దీని తర్వాత ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం పృథ్వీ రాజ్ కి దక్కే అవకాశం ఉండొచ్చు. అయితే కనీసం రెండేళ్ళు కచ్చితంగా ఈ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. మరి సలార్ విలన్ ప్రభాస్ తో మూవీ చేయడం కోసం అంతకాలం వెయిట్ చేస్తాడా అనేది ఇప్పుడు చూడాలి.