Begin typing your search above and press return to search.

ప్రాజెక్ట్ K ఆమె కూడా సర్ ప్రైజ్ చేస్తుందా..!

ఒక దశలో దీపిక కన్నా దిశాకే ఎక్కువ స్క్రీన్ స్పేస్ దొరికిందని అంటున్నారు. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు వాస్తవం ఉంది అన్నది సినిమా చూశాక తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   18 July 2023 10:07 AM GMT
ప్రాజెక్ట్ K ఆమె కూడా సర్ ప్రైజ్ చేస్తుందా..!
X

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేస్తున్న ప్రాజెక్ట్ K మీద రోజు రోజుకి అంచనాలు పెంచేస్తున్నారు. సినిమా ఫస్ట్ గ్లింప్స్ ని ఈ నెల 20న యూఎస్ లో కామిక్ కాన్ వేదికగా రిలీజ్ చేస్తుండగా ఆ మరునాడు ఇండియాలో టీజర్ రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ టీజర్ తోనే సినిమాపై భారీ రేంజ్ లో అంచనాలు ఏర్పరచేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా 500 కోట్లతో ప్రాజెక్ట్ K వస్తుంది. ఈ సినిమాలో కమల్ హాసన్ ప్రతినాయకుడిగా నటించడం ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగేలా చేసింది.

లోకనాయకుడు సినిమాలో ఉన్నాడు అంటే ఆ సినిమా లెక్క వేరేలా ఉంటుంది. అదికూడా ఇంత భారీ బడ్జెట్ సినిమాలో కమల్ ఉండటం సినిమా బిజినెస్ కి కూడా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది. సినిమాలో ప్రభాస్ కి జోడీగా దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది.

సినిమా నుంచి దీపిక ఫస్ట్ లుక్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. అయితే ప్రాజెక్ట్ కె లుక్ పై దీపిక ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు. ఆమె లుక్స్ అంత ఇంప్రెసివ్ గా లేదన్నట్టుగా టాక్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో దీపికాతో పాటుగా మరో హీరోయిన్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

దీపికాతో పాటుగా ప్రాజెక్ట్ కె సినిమాలో దిశా పటాని కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం అసలు హీరోయిన్ దీపికానే అయినా దిశా పటానికి సినిమాలో మంచి పాత్ర దొరికిందని అంటున్నారు. ఒక దశలో దీపిక కన్నా దిశాకే ఎక్కువ స్క్రీన్ స్పేస్ దొరికిందని అంటున్నారు. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు వాస్తవం ఉంది అన్నది సినిమా చూశాక తెలుస్తుంది.

ఈ సినిమా విషయంలో నాగ్ అశ్విన్ ముందునుంచి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నారు. సినిమా రిలీజ్ విషయంలో కూడా హడావిడి చేయకుండా అనుకున్న విధంగా అవుట్ పుట్ వచ్చింది అనుకున్నప్పుడే సంక్రాంతికి వదలాలని లేదంటే 2024 సంక్రాంతికి రిలీజ్ వాయిదా వేయాలని చూస్తున్నారు.

రీసెంట్ గా ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ సెప్టెంబర్ లో సలార్ గా రాబోతున్నాడు. సలార్ తర్వాత ప్రాజెక్ట్ కె ప్రభాస్ రేంజ్ పెంచే సినిమా అవుతుందని అంటున్నారు. ప్రాజెక్ట్ k ఇండియన్ మేకర్స్ తీసిన హాలీవుడ్ సినిమాగా రాబోతుంది. మరి సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి.