పూననమ్ కౌర్ పరిచయం అవసరం లేని పేరు. ఆమె హీరోయిన్ గా సెటిల్ అవ్వాలని టాలీవుడ్ లో అడుగుపెట్టింది కానీ, నటిగా కంటే, కాంట్రవర్సీలతోనే ఆమె ఎక్కువగా పాపులర్ అయ్యిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్ ల గురించే ఎక్కువగా ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేస్తూ ఉంటుందని ఫ్యాన్స్ మండిపడుతూ ఉంటారు. ఆమె కూడా ఎక్కువగా పొలిటికల్ సంబంధింత ట్వీట్స్ చేస్తూ దుమారం రేపుతూ ఉంటారు.
ఇక, ఆమె సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు పెట్టింది అంటే చాలు, పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోతూ ఉంటారు. ఆమెను ఆ పోస్టు కింద కామెంట్స్ రూపంలోనే, లేదంటే మెసేజ్ ల రూపంలో పర్సనల్ గా ఎటాక్ చేస్తూ ఉంటారు. ఆమె డైరెక్ట్ గా పవన్ పేరు ఎత్తకపోయినా అది పవన్ గురించే అంటూ వీళ్లంతా ఆవేశంతో ఊగిపోతూ ఉంటారు.
ఇలా తనను ట్రోల్ చేసేవారిని ఉద్దేశిస్తూ ఆమె తాజాగా ఓ పోస్ట్ పెట్టారు. చాలా మంది తన జీవితాన్ని ఓ వ్యక్తి చుట్టూ తిప్పుతున్నారు అని ఆమె అన్నారు. తాను కేవలం ఓ స్త్రీగా తన మనసులోని విషయాను, సామాజిక సమస్యల గురించి మాట్లాడుతున్నానని అన్నారు.
మణిపూర్ హింస గురించి ఎవరైనా మాట్లాడవచ్చు కదా అన్నారు. ఇక ఓ స్త్రీ జీవితాన్ని మీడియా చాలా ఎక్కువగా చూపిస్తూ ఉంటుందన్నారు.
మీడియా కారణంగా తన ఆరోగ్యం, జీవితం, శారీరకంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోందన్నారు. ఇక, రేణుదేశాయ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను చేనేత కార్మికుల కోసం పని చేశానని చెప్పారు. జీరో జీఎస్టీ కోసం తాను ఒకటిన్నర సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. తాను ఒంటరిగా కార్మికుల కోసం పోరాటం చేస్తున్నట్లు చెప్పారు.
ఇక, కొందరు ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడతారు, కానీ తన జీవితాన్ని మాత్రం కేవలం డబ్బు కే పరిమితం చేశారన్నారు. తన వ్యక్తిత్వాన్ని కేవలం ఓక వ్యక్తికి పరిమితం చేశారని మండిపడ్డారు.
వాస్తవానికి తమ జీవితంలో ఏం జరుగుతోంది అనే కంటే, మీడియా కారణంగా ఎక్కువగా బాధపడిన సందర్భాలు ఉన్నాయన్నారు. తాను ఎవరికీ కోసం రాజీపడలేదని, తాను తన జీవితంలో ఉన్నత స్థానంలో ఉన్నాను, ఎప్పటికీ ఉంటాను అంటూ పేర్కొన్నారు. తాను కపట రాజకీయ నాయకుల గురించి మాట్లాడటం లేదు అని ఆమె చెప్పారు.