Begin typing your search above and press return to search.

పెళ్లి భాజాల కోస‌మేనే ఈ రెస్టారెంట్ మీటింగ్!?

దీంతో పూజాహెగ్డే-రోహాన్ మ‌ధ్య జ‌రుగుతోన్న వ్య‌వ‌హారానికి నిజ‌మే అన‌డానికి ఇదోక బ‌ల‌మైన కార‌ణంగా మారింది. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   18 April 2024 7:15 AM GMT
పెళ్లి భాజాల కోస‌మేనే ఈ రెస్టారెంట్ మీటింగ్!?
X

పూజాహెగ్డే-రోహ‌న్ మిహ్రా మ‌ధ్య సంథింగ్ సంథింగ్ అంటూ కొన్ని నెల‌లుగా ప్ర‌చారం సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. ముంబై వీధుల్లో ఈజోడీ చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగుతూ చాలాసార్లు కెమెరా కంట‌ప‌డ‌టంతోనే విషయం వెలుగులోకి వ‌చ్చింది. నెట్టింట ఇంత ప్ర‌చారం జ‌రుగుతున్నా వాళ్లు సైతం వాటిని ప‌ట్టించుకోకుండానే వ్య‌వ‌హ‌రించ‌డంతో ఈ ప్ర‌చారానికి మ‌రింత‌ బ‌లం చేకూరింది. ఇద్ద‌రి మ‌ధ్య సీరియ‌స్ ల‌వ్ ట్రాక్ న‌డుస్తోంద‌ని క‌థ‌నాలు జోరందుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో లీక్ తో దాదాపు విష‌యం క‌న్ప‌మ్ అవుతున్న‌ట్లుగానే క‌నిపిస్తుంది.

పూజాహెగ్డే త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి రెస్టారెంట్ కి వెళ్లింది. అక్క‌డ ప‌నిముగించుకున్న అనంత‌రం బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌మ‌యంలో కెమెరాకి చిక్కింది. ఆ స‌మ‌యంలో వెంట రోహాన్ కూడా ఉన్నాడు. అయితే రోహ‌న్ పూజ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఉన్న ఫోటో లేదు కానీ..తాను ఒక్క‌డే రెస్టారెంట్ బ‌య‌ట నిల‌బ‌డిన ఫోటో వైర‌ల్ అవుతోంది. ఆ ప‌క్క‌నే పూజా త‌ల్లింద‌డ్రుల‌తో ఉన్న ఫోటో కూడా గ‌మ‌నించ‌వ‌చ్చు. దీంతో ఫ్యామిలీతో ప్రియుడ్ని రెస్టారెంట్ కి తీసుకెళ్లిందా? త‌న ఫ్యామిలీ తో ఇంట‌రాక్ష‌న్ కోసమే ఇలా రెస్టారెంట్ లో క‌లిసారా? అన్న సందేహాలు తెర‌పైకి వ‌స్తున్నాయి.

దీంతో పూజాహెగ్డే-రోహాన్ మ‌ధ్య జ‌రుగుతోన్న వ్య‌వ‌హారానికి నిజ‌మే అన‌డానికి ఇదోక బ‌ల‌మైన కార‌ణంగా మారింది. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇక అధికారికంగా విష‌యాన్ని ధృవీక‌రించ‌డ‌మే ఆల‌స్యంగా క‌నిపిస్తుంది. ఈ మ‌ధ్య కాలంలో బాలీవుడ్ లో న‌వ‌త‌రం భామ‌ల్లోబ్రేక‌ప్ లు పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. ఎంత వేగంగా ప్రేమ‌లో ప‌డుతున్నారో? అంతే వేగంగా పెళ్లి పీఠ‌లెక్కేస్తున్నారు. రెండేళ్ల‌గా చాలా జోడీలు వివాహ బంధంతో ఒక‌టైన సంగ‌తి తెలిసిందే. మ‌రి పూజాహెగ్డే -రోహాన్ జంట కూడా వాళ్ల‌లో క‌లుస్తుందా? లేదా? అన్న‌ది చూడాలి.

రోహన్ మిహ్రా విషయానికొస్తే.. ఆయన దివగంత నటుడు వినోద్ మెహ్రా కుమారుడు. 'బాజీరావ్ మస్తానీ' చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అటుపై 'బజార్' సినిమాలో చిన్న పాత్రలో నటించాడు. '420 ఐపీసీ' సినిమాలో సపోర్టింగ్ రోల్‌లో కనిపించాడు. ఇప్పుడు 'అద్భుతం' అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇవి కాకుండా కొన్ని వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్నాడు.