Begin typing your search above and press return to search.

పవన్ మళ్లీ ఇంకో మూవీనా, మరి వాటి సంగతేంటి..?

పవన్ కళ్యాణ్ ఈ పేరుకు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు పరిచయం అవసరం లేదు.

By:  Tupaki Desk   |   17 July 2023 6:33 PM IST
పవన్ మళ్లీ ఇంకో మూవీనా, మరి వాటి సంగతేంటి..?
X

పవన్ కళ్యాణ్ ఈ పేరుకు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు పరిచయం అవసరం లేదు. ఆయనకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన కేవలం స్క్రిన్ మీద కనపడితే చాలు అని ఫ్యాన్స్ భావిస్తూ ఉంటారు. ఆయన సినిమాలు ఎప్పుడు థియేటర్ మీదకు వస్తుందా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్స్ కోరుకుంటున్నట్లే పవన్ కూడా వెంట వెంటనే సినిమాలు ఎంచుకుంటున్నారు.

ఆయన నటించిన బ్రో మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. కాగా, తాజాగా ఆయన మరో మూవీ కి ఓకే చేసినట్లు తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తో సినిమా చేయడానికి అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే, ఇవి గాసిప్సే కాగా, దాదాపు మూవీ ఖరారు అయినట్లు తెలుస్తోంది.

ఈ వార్త విని చాలా మంది ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కానీ, ఇక్కడ ఓ విషయం గురించి మాత్రం ఆలోచించాల్సిందే. ఇప్పటికే పవన్ చేతిలో రెండు సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి. వాటిలో ఉస్తాద్ భగత్ సింగ్ , హరహరవీర మల్లు మూవీలు ప్రకటించి చాలా కాలమే అవుతుంది. ఈ మూవీలు ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోలేదు. కనీసం ఉస్తాద్ అయినా కొన్ని షెడ్యూల్స్ అయినా అయ్యిందేమో కానీ, హరహర వీర మల్లు అయితే, అసలు మొదలైందా లేదా అనే అనుమానాలు ఉన్నాయి.

ఒప్పుకున్న సినిమాలే పూర్తి చేయలేదు. మళ్లీ కొత్త సినిమా అంటే, అది పూర్తవ్వడానికి ఇంకా ఎంత కాలం పడుతుందా అనే భావన కలుగుతోంది. ముందు ఆ సినిమాలు పూర్తి చేసి, ఆ తర్వాత కొత్త సినిమా ఒప్పుకోవచ్చు కదా అని చాలా మంది అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

మరోవైపు పవన్ కి కేవలం సినిమాలు మాత్రమే కాదు, రాజకీయాలు కూడా ఉన్నాయి. త్వరలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఆయన యాక్టివ్ పాలిటిక్స్ లో పాల్గొనాల్సిన అవసరం ఉంది. మరి ఇలాంటి సమయంలో కొత్త సినిమాలు ఒప్పుకోవడం అవసరమా అనిపిస్తోంది. మరి పవన్ మైండ్ లో ఏముందో..?