Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ సినిమాలో నాని.. లక్కీ ఛాన్స్

ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో నటించే అవకాశం నాని దక్కించుకోవడం విశేషం

By:  Tupaki Desk   |   27 July 2023 6:20 AM GMT
సూపర్ స్టార్ సినిమాలో నాని.. లక్కీ ఛాన్స్
X

నేచురల్ స్టార్ నాని పరిచయం అవసరం లేని పేరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల దసరా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా రూ.100కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయింది.

కాగా, తాజాగా నాని మరో లక్కీ ఛాన్స్ దక్కింది. ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో నటించే అవకాశం నాని దక్కించుకోవడం విశేషం. రజనీకాంత్ కొత్త చిత్రంలో మన తెలుగు హీరో నాని ప్రత్యేక పాత్రలో కనించబోతున్నారు. ఈ మేరకు మాటలు జరిగి ఎగ్రిమెంట్ అయ్యిందని సమాచారం. అది గెస్ట్ రోల్ కాదని సినిమా కథను మలుపు తిప్పే పాత్ర అనే ప్రచారం మొదలైంది.

ఇటీవల సూర్య జై భీమ్ మూవీ ఎంత హిట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆ డైరెక్టర్ టీజే జ్ఞాన‌వేల్‌తో ర‌జ‌నీకాంత్ సినిమా చేయ‌బోతున్నాడు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించ‌నుంది. ఈ మూవీలో ఓ స్పెషల్ రోల్ కోసం నాని కంటాక్ట్ చేయగా, ఆయన చేయడానికి ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందించనున్నారు. ఇక, 2024లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

కాగా, నాని గతంలో రజినీకాంత్ తో కలిసి పనిచేయడం తన డ్రీమ్ అంటూ చెప్పడం విశేషం. ఇప్పుడు ఆయన డ్రీమ్ రియల్ కాబోతోంది. ఈ వార్త నాని ఫ్యాన్స్ ని కూడా చాలా ఖుషీ చేస్తోంది. ఇదిలా ఉండగా, నాని ప్రస్తుతం తన 30వ సినిమా హాయ్ నాన్న షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వైరా ఎంట‌ర్ టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై మోహ‌న్ చెరుకూరి, విజ‌యేంద‌ర్‌రెడ్డి తీగ‌ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీతారామం బ్యూటీ మృణాల్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా శౌర్యువ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

ఇక, హేనాన్న తర్వాత ఆయన మరో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంటే సుందరానికీ మూవీకి దర్శకత్వం వహించిన వివేక్ ఆత్రేయత తో మూవీ చేయనున్నాడు. ఇది కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ కావడ విశేషం. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుంది.