Begin typing your search above and press return to search.

మోక్షజ్ఞ ఎంట్రీ.. ఈసారి మరో గాసిప్?

నందమూరి బాలయ్య వారసుడు మోక్షజ్ఞ డెబ్యూ గురించి చాలా రోజుల నుంచి చర్చ నడుస్తోంది

By:  Tupaki Desk   |   7 Aug 2023 5:38 AM GMT
మోక్షజ్ఞ ఎంట్రీ.. ఈసారి మరో గాసిప్?
X

నందమూరి బాలయ్య వారసుడు మోక్షజ్ఞ డెబ్యూ గురించి చాలా రోజుల నుంచి చర్చ నడుస్తోంది. తనయుడిని గ్రాండ్ గా లాంచ్ చేయాలని బాలకృష్ణ భావిస్తున్నారు. దానికి తగ్గ ప్లాట్ ఫామ్ సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం మోక్షజ్ఞ యాక్టింగ్ తో పాటు డాన్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అలాగే ఫిట్ నెస్ పై దృష్టి పెట్టారు. వెయిట్ లాస్ అయ్యి మళ్ళీ పెర్ఫెక్ట్ షేప్ లోకి రావడానికి కష్టపడుతున్నాడు. ఇప్పటికే మోక్షజ్ఞకి 28 ఏళ్ళు వచ్చేశాయి.

ఈ టైంలో లాంచ్ చేస్తే కరెక్ట్ గా ప్రేక్షకులకి కూడా రీచ్ అవుతాడని నందమూరి ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక మోక్షజ్ఞ లాంచ్ కోసం బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి లాంటి స్టార్ దర్శకుల పేర్లు వినిపించాయి. ఆదిత్య 369కి సీక్వెల్ గా ఆదిత్య 999 మూవీని చేస్తానని బాలయ్య ప్రకటించారు. అలాగే ఆ చిత్రంలో మోక్షజ్ఞ కూడా నటిస్తాడని చెప్పారు. అయితే ఇప్పుడు మరో ప్రచారం తెరపైకి వచ్చింది.

దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల ఓ మంచి కథ సిద్ధం చేసి బాలయ్యకి వినిపించారట. ఆ కథ నచ్చడంతో మోక్షజ్ఞ డెబ్యూ కోసం దానినే ఫైనల్ చేసారంట. శ్రీకాంత్ సినిమా ద్వారానే అతనిని హీరోగా పరిచయం చేయడానికి బాలయ్య కూడా సిద్ధం అయ్యారంటే; ,మరోవైపు బోయపాటి శ్రీను కూడా కథ సిద్ధం చేసారంట.

అయితే బోయపాటి దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేయనున్నాడు. ఈ ఏడాదిలోనే ఆ సినిమా కూడా స్టార్ట్ అయ్యి వచ్చే ఏడాది ఎన్నికల ముందు రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఒక సినిమాకి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. దీంతో పాటుగానే బోయపాటి శ్రీను మూవీ కూడా సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని భావిస్తున్నారు.

ఏది ఏమైనా మోక్షజ్ఞ డెబ్యూ గురించి టాలీవుడ్ లో చాలా కథలు వినిపిస్తున్నాయి. అయితే వచ్చే ఏడాది అతని టాలీవుడ్ ఎంట్రీ ఖాయం అని తెలుస్తోంది. అయితే దర్శకుడు ఎవరనేది మాత్రం సస్పెన్స్ అని చెప్పూచ్చు. ఓ నలుగురు దర్శకుల పేర్లు మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి.