Begin typing your search above and press return to search.

మురుగదాస్ మెగా మూవీ.. జరిగే పనేనా..?

ఈలోగా చిరుతో తమిళ దర్శకుడు మురుగదాస్ మూవీ అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది.

By:  Tupaki Desk   |   17 Aug 2023 5:47 AM GMT
మురుగదాస్ మెగా మూవీ.. జరిగే పనేనా..?
X

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా రిజల్ట్ తో చాలా డీలా పడ్డారని చెప్పొచ్చు. మొదటి నుంచి ఆ సినిమాపై నెగిటివిటీ ఏర్పడగా ఫైనల్ రిజల్ట్ కూడా అదే రావడంతో మెగా కాంపౌండ్ అంతా షాక్ కి గురైంది. ఫ్యాన్స్ తన నుంచి రీమేక్ లు ఆశించట్లేదు అన్నది చిరుకి క్లారిటీగా అర్ధమిదని చెప్పొచ్చు. ఈ క్రమంలో మెగా స్టార్ చిరంజీవి తన నెక్స్ట్ సినిమాల విషయంలో కూడా ఆచి తూచి అడుగులేస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం చిరంజీవి మోకాలి సర్జరీ వల్ల రెస్ట్ లో ఉన్నారు.

నెక్స్ట్ సినిమా అప్డేట్ కి మరో నెల దాకా వెయిట్ చేయక తప్పదని తెలుస్తుంది. ఈలోగా చిరుతో తమిళ దర్శకుడు మురుగదాస్ మూవీ అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఆల్రెడీ మురుగదాస్ డైరెక్ట్ చేసిన రమణ సినిమానే తెలుగులో ఠాగూర్ గా చిరు రీమేక్ చేశారు.

ఆ తర్వాత స్టాలిన్ సినిమాను మురుగదాస్ డైరెక్షన్ లో చేశారు చిరంజీవి. అయితే ఆ సినిమా కూడా హిట్ కొట్టలేదు. ఒకప్పుడు మురుగదాస్ సినిమాలన్నీ టార్గెట్ హిట్ అనేలా ఉండేవి కానీ రాను రాను ఆయన సినిమాలు కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి.

రజిని దర్బార్ సినిమా ఛాన్స్ ఇచ్చినా కూడా వర్క్ అవుట్ చేసుకోలేని మురుగదాస్ ప్రస్తుతం శివ కార్తికేయన్ తో సినిమా డిస్కషన్స్ లో ఉన్నారని తెలుస్తుంది. ఈలోగా చిరుతో మురుగదాస్ సినిమా అంటూ ప్రచారం మొదలైంది. సరైన కంటెంట్ తో వస్తే చిరు మురుగదాస్ కాంబో రికార్డులు కొట్టే ఛాన్స్ ఉంది. కానీ మురుగదాస్ అలాంటి కథ సిద్ధం చేశాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

ఒకప్పుడు పాన్ ఇండియా హిట్లతో సూపర్ ఫాం లో ఉన్న డైరెక్టర్ మురుగదాస్ ఇలా కెరీర్ లో వెనకబడటం ఫ్యాన్స్ ని నిరాశపరుస్తున్నా సరే ఆయన కం బ్యాక్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. శివ కార్తికేయన్ తో మురుగదాస్ సినిమా దాదాపు ఉంటుందనే కోలీవుడ్ టాక్. మరి ఆ సినిమా తర్వాత చిరుతో సినిమా ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. భోళా శంకర్ తర్వాత బింబిసార డైరెక్టర్ వశిష్టతో చిరు సినిమా ఉంటుందని తెలుస్తుంది.

కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా ప్లానింగ్ లో ఉండగా ఆ సినిమా గురించి మెగాస్టార్ వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తుంది. చిరు 157 ఒక్కటే ప్రస్తుతానికి కన్ఫర్మ్ అయ్యేలా ఉంది. 158 ఆ తర్వాత సినిమాల డైరెక్టర్స్ లిస్ట్ బయటకు రావాల్సి ఉంది.