Begin typing your search above and press return to search.

విశ్వంభర.. మెగాస్టార్ జోడి ఫిక్స్ అయినట్లే..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట మల్లిడి దర్శకత్వంలో సోషియో ఫాంటసీ కథతో మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   2 Nov 2023 4:05 AM GMT
విశ్వంభర.. మెగాస్టార్ జోడి ఫిక్స్ అయినట్లే..
X

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట మల్లిడి దర్శకత్వంలో సోషియో ఫాంటసీ కథతో మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా సెకండ్ ఇన్నింగ్ లో తనకి రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన జోనర్ మళ్ళీ ఎంచుకొని మూవీ చేస్తున్నారు.

ఇప్పటికే పోస్టర్స్ తో ఈ సినిమా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. పంచభూతాలని రిప్రజెంట్ చేస్తూ చేసిన కాన్సెప్ట్ పోస్టర్, రీసెంట్ గా రిలీజ్ చేసిన త్రిశూలం పోస్టర్స్ సినిమాపై ఇంటెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే నవంబర్ 15 తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారంట. రాజమండ్రిలో ఫస్ట్ షెడ్యుల్ కి ప్లాన్ చేస్తున్నారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మెగాస్టార్ కి జోడీగా స్టార్ హీరోయిన్ ఉండాలని ఫిక్స్ అయిన చిత్ర యూనిట్ అనుష్క, నయనతార పేర్లు పరిశీలించారు. ఫైనల్ గా అనుష్కని ఖరారు చేయడం విశేషం. త్వరలో ఈ విషయాన్ని ధృవీకరించే అవకాశం ఉందంట. బాహుబలి సిరీస్ తర్వాత ఫిమేల్ సెంట్రిక్ కథలు మాత్రమే చేసిన అనుష్క చాలా గ్యాప్ తర్వాత ఒప్పుకున్న కమర్షియల్ మూవీ ఇదే కావడం విశేషం.

అనుష్క శెట్టి రీసెంట్ గా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకుంది. యూవీ క్రియేషన్స్ లోనే ఈ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా నవీన్ పొలిశెట్టి ఎంటర్టైన్మెంట్, అనుష్క సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యింది.

ఇదిలా ఉంటే విశ్వంభర అనే టైటిల్ ని ఈ సినిమాకి పెట్టినట్లు తెలుస్తోంది. షూటింగ్ షెడ్యుల్ స్టార్ట్ అయిన తర్వాత టైటిల్, చిరంజీవి ఫస్ట్ లుక్ ని ఒకేసారి లాంచ్ చేసే అవకాశం ఉందని చిత్రపురిలో వినిపిస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో మెగాస్టార్ రేంజ్ ని మరోసారి పరిచయం చేస్తుందని అంచనా వేస్తున్నారు.