Begin typing your search above and press return to search.

దేవరకు అక్కగా.. ఆమె నటిస్తోందా?

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న రెండవ సినిమా దేవర పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

By:  Tupaki Desk   |   29 Oct 2023 11:28 AM GMT
దేవరకు అక్కగా.. ఆమె నటిస్తోందా?
X

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న రెండవ సినిమా దేవర పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ ప్రాజెక్టు షూటింగ్ మొదలైనప్పటి నుంచి కూడా గ్యాప్ లేకుండా ముందుకు కొనసాగుతోంది. రీసెంట్ గా గోవాలో ఒక షెడ్యూల్ అయితే మొదలుపెట్టారు. ఈ షెడ్యూల్లో సినిమాకు సంబంధించిన ప్రముఖ నటీనటులు పాల్గొనబోతున్నారు.

దేవర సినిమాలో స్టార్ క్యాస్ట్ తోనే దర్శకుడు ఫ్యాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా అంచనాలను క్రియేట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో హైలెట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఇప్పటికే ప్రాజెక్టును రెండు భాగాలుగా తలపైకి తీసుకురాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇక లేటెస్ట్ గా సినిమాకు సంబంధించిన మరొక గాసిప్ వైరల్ గా మారుతోంది. ఈ సినిమాలో మంచు లక్ష్మి కూడా కనిపించబోతున్నట్లు టాక్ మొదలయ్యింది. ఆమె జూనియర్ ఎన్టీఆర్ అక్కగా కనిపించబొతున్నట్లు గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. రీసెంట్ షెడ్యూల్లో కూడా ఆమె పాల్గొనట్లు టాక్ వస్తోంది.

ఇక ఆ పాత్రలో కాస్త నెగటివ్ స్టేట్స్ కూడా ఉండబోతున్నాయట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అధికారికంగా క్లారిటీ వచ్చేవరకు ఆగాల్సిందే. ప్రస్తుతం మంచు లక్ష్మి అయితే కొన్ని పెద్ద సినిమాలలో కూడా నటిస్తోంది. ఇక అందులో దేవర కూడా ఉండబోతున్నట్లు సమాచారం. ఇక దేవర సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది.

దర్శకుడు కొరటాల శివ పక్కా ప్రణాళికతో ఎలాంటి ఆలస్యం జరగకుండా అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. ఇక ప్రాజెక్టును 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయబోతున్నట్లు గతంలోనే క్లారిటీ ఇచ్చారు. ఇక ఆ డేట్ విషయంలో అయితే ఎలాంటి డౌట్స్ లేవని వాయిదా పడే అవకాశం లేదని కూడా చెబుతూ వస్తున్నారు. ఇక డిసెంబర్లో ఈ సినిమాకు సంబంధించిన మరొక కీలకమైన అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.