Begin typing your search above and press return to search.

మహేష్ మరో సినిమా.. అక్కడ స్పేస్ లేదమ్మా

ముఖ్యంగా నిర్మాత అనిల్ సుంకర కోసమే మహేష్ అనిల్ రావిపూడి తో సినిమా చేయబోతున్నట్లు కూడా గాసిప్స్ వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   26 Sep 2023 11:38 AM GMT
మహేష్ మరో సినిమా.. అక్కడ స్పేస్ లేదమ్మా
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో నెక్స్ట్ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గుంటూరు కారం ప్రాజెక్ట్ లో నటిస్తున్న మహేష్ వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును ఫినిష్ చేసుకుని రాజమౌళి కోసం సిద్ధం కావాలని అనుకుంటున్నాడు.

అయితే ఇప్పుడు ఊహించని విధంగా మీడియాలో మరొక కొత్త టాక్ అయితే వైరల్ అవుతుంది. రాజమౌళి సినిమా కంటే ముందే మహేష్ బాబు మరొక సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి. సాధారణంగా మహేష్ మంచి హార్డ్ వర్కర్ అని తెలిసిందే. కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలే కానీ అతను రెండు నెలల్లో సినిమాను ఫినిష్ చేసేందుకు దర్శక నిర్మాతలకు సహకరిస్తాడు.

గతంలో వేగంగా సినిమాలను పూర్తి చేసిన అగ్ర హీరోల్లో మహేష్ పేరే ముందుగా వినిపిస్తూ ఉంటుంది. అందులో బిజినెస్ మెన్ ఒకటి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం అది అంత సులువైన విషయమేమీ కాదు. గుంటూరు కారం సినిమా కోసం ఇప్పటికే చాలా సమయం వృధా అయ్యింది. ఇక రాజమౌళి స్క్రిప్ట్ పనుల కోసం కూడా కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు.

కాబట్టి గుంటూరు కారం విషయంలో మహేష్ పెద్దగా టెన్షన్ లేకుండానే మెల్లగా ఫినిష్ చేసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు రాజమౌళి ఇంకాస్త ఎక్కువ సమయం తీసుకునే ఛాన్స్ ఉంది అని అందుకే ఈ లోపు మరొక ప్రాజెక్టును మహేష్ చేయాలని అనుకుంటున్నాట్లుగా టాక్ వినిపించింది. ముఖ్యంగా నిర్మాత అనిల్ సుంకర కోసమే మహేష్ అనిల్ రావిపూడి తో సినిమా చేయబోతున్నట్లు కూడా గాసిప్స్ వస్తున్నాయి.

కానీ ప్రస్తుతం మహేష్ సన్నిహితుల నుంచి వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే అలాంటి ప్లాన్ ఏమి లేదని తెలుస్తోంది. ఎందుకంటే మహేష్ రాజమౌళి సినిమా స్టార్ట్ అవ్వడానికి రెండు నెలల ముందే సిద్ధం అవ్వాలని అనుకుంటున్నాడు. రాజమౌళి లుక్కును ఏమైనా మార్చుకోమంటారా లేదంటే ఫిట్నెస్ విషయంలో కూడా మార్పులు చేయమంటారా అనే ప్రశ్నలు మహేష్ లో ఇప్పుడు చాలానే ఉన్నాయి. ఆ విషయంలో రాజమౌళి నుంచి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ప్రస్తుతం జక్కన్న తన తండ్రి విజయేంద్రప్రసాద్ తో అలాగే తన రైటింగ్ డిపార్ట్మెంట్ తో కలిసి స్క్రిప్టును సంసిద్ధం చేస్తున్నాడు. ఇక నెక్స్ట్ ఫోకస్ మొత్తం కూడా ఆ సినిమా పైనే ఉంది కాబట్టి మహేష్ ఇప్పట్లో అయితే మరో సినిమా అనే ఆలోచన లేదని తెలుస్తోంది. జనవరికి గుంటూరు కారం సినిమాను విడుదల చేసి వెంటనే రాజమౌళి టీం తో కలిసి పోవాలి అని మహేష్ ఫిక్స్ అయ్యాడు. మరి ఆ ప్రాజెక్ట్ నెక్స్ట్ అనౌన్స్మెంట్ ఎప్పుడు ఉంటుందో చూడాలి.