Begin typing your search above and press return to search.

సలార్ లో ఆమె 'గేమ్ చేంజర్‌'...!

సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్‌ అనుసారం సలార్‌ 2 లో మరో హీరోయిన్‌ రోల్‌ కి గాను గేమ్‌ చేంజర్ హీరోయిన్ కియారా అద్వానీని దర్శకుడు పరిశీలిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   23 April 2024 4:16 AM GMT
సలార్ లో ఆమె గేమ్ చేంజర్‌...!
X

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన సలార్‌ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుని పాన్ ఇండియా రేంజ్‌ లో వసూళ్ల వర్షం కురిపించింది. సలార్ సూపర్ హిట్ నేపథ్యంలో సలార్ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి.





ఇప్పటికే సలార్ 2 వర్క్ షురూ అయ్యిందని యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. సలార్ 1 తో పోల్చితే సలార్‌ 2 రెట్టింపు యాక్షన్‌ తో పాటు, ఎమోషన్స్‌ తో కూడుకున్నదిగా ఉండబోతుందట. సలార్‌ 2 పై ఉన్న అంచనాల నేపథ్యంలో రెగ్యులర్ గా సినిమా గురించి ప్రచారం జరుగుతూనే ఉంది.

సలార్‌ 2 గురించి ఎన్నో పుకార్లు సోషల్‌ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. తాజాగా మరోసారి సలార్ 2 హీరోయిన్‌ గురించిన పుకారు ఒకటి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సలార్ లో శృతి హాసన్ కనిపించిన విషయం తెల్సిందే. సలార్‌ 2 లో కూడా ఆమె పాత్ర ఉండబోతుంది. శృతి తో పాటు మరో హీరోయిన్ కూడా సలార్‌ 2 లో కనిపించబోతుందట.

సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్‌ అనుసారం సలార్‌ 2 లో మరో హీరోయిన్‌ రోల్‌ కి గాను గేమ్‌ చేంజర్ హీరోయిన్ కియారా అద్వానీని దర్శకుడు పరిశీలిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సినిమాకు సంబంధించి కియారా ఓకే చెప్పడం జరిగిందని కూడా వార్తలు వస్తున్నాయి.

రామ్ చరణ్‌ కి జోడీగా గేమ్‌ చేంజర్ సినిమాలో నటిస్తున్న ముద్దుగుమ్మ కియారా అద్వానీ మరో వైపు హిందీలో కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది. ఇలాంటి సమయంలో కియారా అద్వానీకి సలార్‌ 2 లో ఛాన్స్ రావడం, అందుకు ఓకే చెప్పడం అనే వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.