Begin typing your search above and press return to search.

#గుస‌గుస‌.. విశాల్‌పై పెళ్లి పుకార్లు ఆగవా?

ప‌రిశ్ర‌మ‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ గా అత‌డికి గాళ్స్ లో బోలెడంత ఫాలోయింగ్ ఉంది

By:  Tupaki Desk   |   11 Aug 2023 4:22 AM GMT
#గుస‌గుస‌.. విశాల్‌పై పెళ్లి పుకార్లు ఆగవా?
X

యాక్ష‌న్ హీరో విశాల్ తమిళం-తెలుగులో సుప‌రిచితుడు. క‌థానాయిక‌ల‌తో అత‌డి డేటింగులు అంతే సెన్సేష‌న్ గా మారుతుంటాయి. ప‌రిశ్ర‌మ‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ గా అత‌డికి గాళ్స్ లో బోలెడంత ఫాలోయింగ్ ఉంది. కానీ ఇటీవ‌ల విశాల్ పెళ్లి మాటే ఎత్త‌డం లేదు. అయితే ఇంత‌లోనే విశాల్ 'పాండియ నాడు' స‌హ‌న‌టి లక్ష్మీ మీనన్ తో డేటింగ్ లో ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నార‌ని త్వరలో పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి.

అయితే విశాల్ ఎఫైర్ల గురించి ఇప్పుడే ప్ర‌చారం సాగ‌డం లేదు. చాలా కాలంగా క‌థానాయిక‌ల‌తో లింక‌ప్ వార్త‌ల్ని కోలీవుడ్ మీడియా ప్ర‌చారం చేసింది. గతంలో విశాల్ త‌న చిన్న‌నాటి స్నేహితురాలు వరలక్ష్మి శరత్‌కుమార్ తో రిలేష‌న్ లో ఉన్నాడ‌ని త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నార‌ని కూడా పుకార్లు షికార్ చేశాయి. తరువాత ఇద్దరూ ఆ ప్ర‌చారాన్ని ఖండించారు. విశాల్.. వరలక్ష్మి తాము మంచి స్నేహితులమని పేర్కొన్నారు. అప్పట్లో నడిగర్ సంఘం ఎన్నికల సమయంలో వరలక్ష్మి తండ్రి శరత్‌కుమార్‌పై విశాల్ ఆరోపణలు చేయడంతో వారి సంబంధం చెడిపోయింది.

విశాల్‌కి హైద‌రాబాద్ కి చెందిన‌ తెలుగు నటి అనీషా రెడ్డితో నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే వీరి నిశ్చితార్థం క్యాన్సిల్ కావడంతో పెళ్లి ఆగిపోయింది. అయితే అంత‌కుముందే విశాల్ న‌టి అభినయతో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చిలువ‌లు ప‌లువ‌లుగా ప్ర‌చార‌మ‌య్యాయి. ఆ తర్వాత అనీషాతో నిశ్చితార్థం బ్రేక్ అయింది.

ల‌క్ష్మీమీన‌న్ తో కానీ ఇత‌ర క‌థానాయిక‌ల‌తో కానీ ప్రేమాయ‌ణం గురించి ఎప్పుడూ విశాల్ ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. వారి సంబంధం లేదా వివాహం గురించి అధికారిక ధృవీకరణ ఏదీ చేయ‌లేదు. కెరీర్ లో లక్ష్మీ మీనన్ తో వ‌రుస చిత్రాల్లో జంట‌గా న‌టిండంతో ఇద్ద‌రి ల‌వ్వాయ‌ణంపైనా ఎక్కువ‌గా ప్ర‌చారం సాగింది. కుమ్కి, మిరుతన్, వేదాళం, సూదాడి స‌హా మరిన్ని చిత్రాలలో తన నటనా నైపుణ్యంతో ల‌క్ష్మీ మీన‌న్ పాపుల‌రైంది. విశాల్ స‌ర‌స‌న వ‌రుస‌గా యాక్ష‌న్ చిత్రాల్లో నాయిక‌గా న‌టించింది.

ఇప్పుడు మ‌రోసారి తాజాగా విశాల్‌- లక్ష్మీమీనన్ జంట‌పై పుకార్లు మొద‌ల‌య్యాయి. అయితే ఈ పుకార్లను విశాల్ టీమ్ ఖండించింది. ''ఇదంతా త‌ప్పుడు ప్ర‌చారం.. ఈ వార్త‌లు నిజాలు కాదు. త‌ప్పుడు క‌థ‌నాలు రాయొద్దు'' అని విశాల్ కోరారు. తదుప‌రి విశాల్ తన బహుభాషా చిత్రం 'మార్క్ ఆంథోని' విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇది వినాయక చతుర్థి శుభ సందర్భంగా విడుదలకు సిద్ధంగా ఉంది.