Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్ గాసిప్స్ కనిపించట్లేదా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గేమ్ ఛేంజర్ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

By:  Tupaki Desk   |   6 Nov 2023 4:41 AM GMT
గేమ్ ఛేంజర్ గాసిప్స్ కనిపించట్లేదా?
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గేమ్ ఛేంజర్ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా రిలీజ్ డేట్ కంటే ముందు కనీసం పోస్టర్లతో అయినా సంతృప్తి పరుస్తారేమో అంటే అది లేదు. ఇప్పటివరకు వచ్చిన పోస్టర్స్ కూడా పెద్దగా బజ్ క్రియట్ చేయలేదు. ఇక సినిమాకు సంబంధించిన లీక్స్ ఏదో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంది.

కానీ అవేమి సినిమాకు పెద్దగా ప్లస్ ప్లస్ కాలేదు. అంతే కాకుండా వచ్చిన లీక్స్ కూడా కొన్ని ట్రోలింగ్స్ కు గురయ్యాయి. సినిమా అసలు ఎంతవరకు పూర్తయింది ఎప్పుడు ఫస్ట్ అప్డేట్ ఇస్తారు అనే విషయంలో ఇప్పటివరకు యూనిట్ ఒక సరైన క్లారిటీ ఇవ్వలేదు. దిల్ రాజు ఎక్కడ కనిపించిన కూడా అంతా దర్శకుడు శంకర్ చేతుల్లోనే ఉంది అన్నట్లుగా సమాధానాలు ఇచ్చేస్తున్నారు.

మరోవైపు శంకర్ ఇండియన్ 2 సినిమా పై కాస్త ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటున్నారు అనే విధంగా కూడా కామెంట్స్ వస్తున్నాయి. అందుకు కారణం ఆ సినిమా తొందరగానే రాబోతున్నట్లుగా ఒకటి క్లారిటీ వచ్చేసింది. దాని తర్వాతనే రామ్ చరణ్ గేమ్ చేజర్ ఉంటుందని అర్థమవుతుంది. ఇక గేమ్ ఛేంజర్ పై గాసిప్స్ ఎన్ని రకాలుగా వస్తున్న కూడా పట్టించుకోని చిత్ర నిర్మాణ సంస్థ దిల్ రాజు పై వచ్చిన అర్థం లేని గాసిప్ పై వెంటనే స్పందించడం ఫాన్స్ ను మరింత ఆగ్రహానికి గురిచేస్తోంది.

రీసెంట్ గా దిల్ రాజు కొందరి ప్రముఖ నిర్మాతలతో కలిసి ఒక ఓటీటీ సంస్థను మొదలుపెట్టబోతున్నట్లుగా పలు రకాల గాసిప్స్ అయితే పుట్టుకొచ్చాయి. ఈ రూమర్ ఏది కూడా దిల్ రాజు బ్రాండ్ ను తగ్గించేది కాదు. అయినప్పటికీ కూడా ఆ విషయంపై చాలా క్లియర్ గా స్పందించారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు అని దిల్ రాజు ప్రొడక్షన్ క్లారిటీ ఇచ్చింది.

అయితే ఇలాంటి వాటికి సమాధానాలు ఇచ్చే బదులు పెద్ద భారీ ప్రాజెక్ట్ అయినటువంటి గేమ్ చెంజర్ పావు ఎందుకు రియాక్ట్ కావడం లేదని ఫ్యాన్స్ ఆగ్రహం వవ్యక్తం చేస్తున్నారు. నిర్మాత దిల్ రాజు నుంచి కచ్చితంగా ఏదో ఒక అప్డేట్ రావాలని మెగా అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.