Begin typing your search above and press return to search.

అట‌కెక్కిన `ధృవన‌క్ష‌త్రం`.. గౌత‌మ్ మీన‌న్ ఏమ‌న్నారు?

చియాన్ విక్రమ్ - గౌత‌మ్ మీనన్ క‌ల‌యిక‌లో `ధృవ నచ్చతిరమ్`(ధృవన‌క్ష‌త్రం-తెలుగు) చాలా కాలంగా నిర్మాణద‌శ‌లోనే ఉంది.

By:  Tupaki Desk   |   16 July 2023 5:21 AM GMT
అట‌కెక్కిన `ధృవన‌క్ష‌త్రం`.. గౌత‌మ్ మీన‌న్ ఏమ‌న్నారు?
X

చియాన్ విక్రమ్ - గౌత‌మ్ మీనన్ క‌ల‌యిక‌లో `ధృవ నచ్చతిరమ్`(ధృవన‌క్ష‌త్రం-తెలుగు) చాలా కాలంగా నిర్మాణద‌శ‌లోనే ఉంది. స్పై థ్రిల్లర్ క‌థాంశంతో తెర‌కెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ గురించి ఇప్ప‌టికీ స్ప‌ష్ఠ‌త రాలేదు. నిజానికి ధృవ నచ్చతిరమ్ ప్రారంభం నుంచి మేకింగ్ ప‌రంగా ర‌క‌ర‌కాల ఇబ్బందుల‌ను ఎదుర్కొంటోంది. చివ‌రికి 2023 వేసవిలో థియేటర్లలోకి రానుందని క‌థ‌నాలొచ్చాయి. కానీ ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో రిలీజ్ తేదీ మళ్లీ వాయిదా పడింది. మ‌రోసారి ఈ చిత్రం వాయిదా ప‌డింద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అయితే దర్శకుడు గౌతమ్ మీనన్ ఇప్పుడు తన ప్రతిష్టాత్మక చిత్రం విడుద‌ల‌పై కీల‌క అప్ డేట్ ని ఇచ్చాడు.

`ధృవ నచ్చతిరమ్` నుంచి సెకండ్ సింగిల్ ని విడుదల చేసేందుకు గౌత‌మ్ మీన‌న్ రెడీ అవుతున్నారు. ఆయ‌న తాజాగా తన అధికారిక ట్విట్టర్ లో ధృవ‌న‌చ్చ‌తిర‌మ్ రిలీజ్ ప్ర‌మోష‌న్స్ పై అప్ డేట్ ని అందించారు. తద్వారా రిలీజ్ మ‌రింత‌ ఆలస్యం అవుతుంద‌ని సాగుతున్న‌ పుకార్లకు చెక్ పెట్టారు. ధృవ నచ్చతిరమ్ ప్రమోషన్ లను ఈ చిత్రం రెండవ సింగిల్ విడుదలతో తిరిగి స్టార్ట్ చేయబోతున్నట్లు గౌత‌మ్ ధృవీకరించారు. ఈ రెండో సింగిల్ జూలై 19 బుధవారం విడుదల కానుంది. ఈ పాట ఎలా ఉండ‌బోతోంది? అంటే.. ఈ రెండో పాట గూఢ‌చారి జాన్ పై థీమ్ సాంగ్ అని చెబుతున్నారు. చియాన్ ఇందులో జాన్ అనే స్పై పాత్ర‌లో న‌టిస్తున్నార‌ని స‌మాచారం. ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ స్వ‌రాల్ని అందించారు. పాటకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

ధృవ నచ్చతిరమ్ క‌థాంశం ఇంత‌కుముందే లీకైంది. భారత జాతీయ భద్రతా సంస్థకు సేవలందిస్తున్న అత్యంత క‌ఠోర‌మైన‌ శిక్షణ పొందిన గూఢచారి జాన్ పాత్రలో చియాన్ విక్రమ్ న‌టించారు. 10 మంది సీక్రెట్ ఏజెంట్ల బృందానికి జాన్ నాయకుడు. వారు వివిధ మారువేషాలలో భారతదేశ జాతీయ భద్రతా సంస్థ (ఎన్.ఐ.ఏ) కోసం పని చేస్తారు. దేశ భ‌ద్ర‌త‌లో ఎన్.ఐ.ఏ ఆప‌రేష‌న్ కి ఎదురైన చిక్కులేమిటి... వాటిని క‌థానాయ‌కుడు విక్ర‌మ్ ఎలా ప‌రిష్క‌రించార‌న్న‌ది తెర‌పైనే చూడాలి. ఇది భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ అని కూడా తెలుస్తోంది. ఇందులో ఐశ్వర్య రాజేష్- రీతూ వర్మ కథానాయికలుగా నటిస్తున్నారు. రాధిక శరత్ కుమార్- సిమ్రాన్- ఆర్ పార్థిబన్- దివ్యదర్శిని- అర్జున్ దాస్- మున్నా- వంశీకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హ్యారిష్ పాటలు ఒరిజినల్ స్కోర్ యూనిక్ గా ఉంటాయ‌ని చెబుతున్నారు. ఆంథోని ఎడిటింగ్ ను నిర్వహిస్తున్నారు. ఒండ్రాగా ఎంటర్ టైన్ మెంట్- కొండడువోమ్ ఎంటర్ టైన్ మెంట్ -ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం విడుదల తేదీని అధికారిక ట్రైలర్ తో పాటు అతి త్వరలో వెల్లడించే అవకాశం ఉందని తెలిసింది.