Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరో 68 లో అమీర్ ఖాన్!

బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ కి టాలీవుడ్ లో మంచి స్నేహితులున్నారు.

By:  Tupaki Desk   |   5 Sep 2023 11:30 PM GMT
ఆ స్టార్ హీరో 68 లో అమీర్ ఖాన్!
X

బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ కి టాలీవుడ్ లో మంచి స్నేహితులున్నారు. చిరంజీవి.. నాగార్జున‌..రామ్ చ‌ర‌ణ్ లాంటి స్టార్ల‌తో మంచి రిలేష‌న్ షిప్ ఉంది. `లాల్ సింగ్ చ‌డ్డా` రిలీజ్ స‌మ‌యంలో వారంతా! ప్ర‌చారానికి ఎంత‌గా స‌హ‌క‌రించారో తెలిసిందే. అయితే ఈ ర‌క‌మైన బాండింగ్ కోలీవుడ్ హీరోల‌తో లేదు. తాజాగా అలాంటి స్నేహాన్ని కోలీవుడ్ హీరోల‌తోనూ అమీర్ కోరుకుంటున్నారా? అంటే అవున‌నే చెబుతుంది ఈ స‌న్నివేశం.

అమీర్ లిస్ట్ లో మొద‌టి పేరు త‌ల‌ప‌తి విజ‌య్ ఉన్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. విజ‌య్ హీరోగా త‌న 68వ చిత్రం వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఏజీఎస్ ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమాలో అమీర్ ఖాన్ ని కూడా స‌ద‌రు ప్రొడ‌క్ష‌న్ హౌస్ భాగం చేస్తున్న‌ట్లు తెలిసింది. అమీర్ ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్లు సంస్థ స‌న్నిహిత వ‌ర్గాల నుంచి లీకైంది.

అలాగే ఇదే సంస్థ నిర్మిస్తోన్న మ‌రో సినిమా `త‌ని వ‌రువ‌న్-2` లో కూడా అమీర్ ని దించేలా సంస్థ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలిసింది. ఇటీవ‌లే నిర్మాత‌లు అమీర్ ని సంప్ర‌దించిన‌ట్లు.. ఆయ‌న సానుకూలంగా స్పందించిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఇలా నిర్మాత‌లు వెళ్లి అమీర్ ఒప్పుకోవ‌డం జ‌రిగింది అంటే దాని వెనుక విజ‌య్ ఉన్నార‌ని చెప్పాల్సిన ప‌నిలేదు. ఇటీవ‌ల బాలీవుడ్ హీరోలు సౌత్ మార్కెట్ పై క‌న్నేసిన సంగ‌తి తెలిసిందే.

దీనిలో భాగంగా షారుక్ ఖాన్ త‌న `జ‌వాన్` సినిమాని పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. చెన్నై లో ప్ర‌త్యేకంగా ఈవెంట్ కూడా నిర్వ‌హించి మార్కెట్ చేసుకున్నారు. త‌న‌కున్న మంది మార్బ‌లాన్ని దించ‌గ‌లిగారు. అలాంటి స‌పోర్ట్ అమీర్ కి కోలీవుడ్ లో ఇంకా బిల్డ్ అవ్వ‌లేదు. అలా జ‌ర‌గాలి అంటే ఇలాంటి ఆఫ‌ర్లు కాద‌న‌కుండా ఒప్పుకోవాలి. అప్పుడే ప్రెండ్ షిప్ మొద‌లువుతుంది. ఈ క్ర‌మంలో నే అమీర్ కూడా ఎజీఎస్ ఆఫీర్ ని రిజెక్ట్ చేసి ఉండ‌రనిపిస్తుంది.