Begin typing your search above and press return to search.

అల్లు అర్హ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..

సినిమాల్లో చిన్న పిల్లలు నటించడం చాలా కామన్. అచ్చంగా చిన్న పిల్లలతోనే సాగే సినిమాలు కూడా ఇప్పటి వరకు చాలానే వచ్చాయి.

By:  Tupaki Desk   |   16 July 2023 6:52 AM GMT
అల్లు అర్హ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..
X

సినిమాల్లో చిన్న పిల్లలు నటించడం చాలా కామన్. అచ్చంగా చిన్న పిల్లలతోనే సాగే సినిమాలు కూడా ఇప్పటి వరకు చాలానే వచ్చాయి. కానీ, ఆ సినిమాల్లో స్టార్ కిడ్స్ నటిస్తే, దానికి వచ్చే క్రేజ్ మాములుగా ఉండదు. వారి జస్ట్ కనిపించేంది రెండు, మూడు నిమిషాలు అయినా, వారిని చూడటానికి ఫ్యాన్స్ చాలా ఎక్కువ ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఓ స్టార్ హీరో కూతురు అలాంటి క్రేజ్ సంపాదించుకుంది.

ఇటీవల మహేష్ కూతురు ఒక యాడ్ కోసం ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంది. ఇక ఇప్పుడు ఆ లిస్ట్ లో మరో స్టార్ కిడ్ కూడా చేరింది. అల్లు అర్జున్ ముద్దుల తనయ కు మాములగానే క్రేజ్ చాలా ఎక్కువ. ఇటీవల శాకుంతలం సినిమాలో అద్భుతమైన ప్రదర్శన కనిపించి అందరిచేతా వ్వా అనిపించుకుంది. మూవీ హిట్ కాకపోయినా, కేవలం అర్హా కనిపించిన ఐదు నిమిషాల కోసం ఈ మూవీ చూసినవారు ఉన్నారు. శాకుతలం సినిమా మొత్తంలో అర్హ కనిపించిన భాగమే హైలెట్ అని చెప్పాలి. ఈ మూవీ తర్వాత ఆమె క్రేజ్ మరింత పెరిగిపోయింది.

కాగా, తాజాగా ఆమెకు మరో మూవీలో ఛాన్స్ వచ్చిందట. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ మూవీ దేవర తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో అల్లు అర్హ నటించనున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. హీరోయిన్ జాన్వీ కపూర్ చిన్నప్పటి పాత్రలో కనిపించే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్. ఈ సినిమాలో అల్లు అర్హ నటించేందుకు అల్లు అర్జున్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ఇందులో ఆమె పాత్ర నిడివి 10 నిమిషాలు ఉండనుందని ాక్ వినిపిస్తోంది. అయితే ఈ పది నిమిషాలకే అర్హకు రూ.20 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. ఒక్కో నిమిషానికి రెండు లక్షలు తీసుకుంటోంది. ఈ రెమ్యూనరేషన్ బయటకు లీక్ అవ్వడంతో అందరూ షాకౌతున్నారు.

కేవలం చైల్డ్ ఆర్టిస్ట్ గానే నిమిషానికి రూ.రెండు లక్షలుు తీసుకుంటోంది అంటే, హీరోయిన్ అయిన తర్వాత ఆమె రేంజ్ ఎలా ఉంటుందా అనే చర్చ మొదలైంది. ఇప్పటి నుంచే అర్హ తండ్రిని మించిపోతోందిగా అనే కామెంట్స్ వినపడుతున్నాయి.