Begin typing your search above and press return to search.

వామ్మో ఇదెక్కడి కాంబో అఖిల్?

అఖిల్ అక్కినేని తన నెక్స్ట్ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు అనే విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది.

By:  Tupaki Desk   |   23 Sep 2023 10:51 AM GMT
వామ్మో ఇదెక్కడి కాంబో అఖిల్?
X

అఖిల్ అక్కినేని తన నెక్స్ట్ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు అనే విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏజెంట్ సినిమాతో కోలుకోలేని విధంగా దారుణంగా డిజాస్టర్ ఎదుర్కొన్న అఖిల్ తదుపరి సినిమా ఎంపిక చేసుకున్న విధానం అతనికి కూడా చాలా ముఖ్యం కానుంది. ఎలాంటి సినిమాతో వస్తే మళ్లీ ట్రాక్ లోకి రావచ్చు అనే విషయం గురించి అతను గట్టిగానే ఆలోచిస్తున్నాడు. పర్ఫెక్ట్ కథ సెట్ అయ్యేవరకు రిస్కు తీసుకోవద్దు అని కూడా కొంత ఎక్కువ టైం తీసుకుని ఆలోచిస్తున్నాడు.

అయితే అఖిల్ నెక్స్ట్ కాంబినేషన్ విషయం గురించి ఇప్పటికే చాలా రకాల గాసిప్స్ అయితే వచ్చాయి. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉంది అని అలాగే వశిష్టత కూడా సినిమా ఉంటుంది అని ఆ మధ్య కథనాలు వెలుపడ్డాయి. కానీ ఆ రెండు నిజాలు అయ్యే అవకాశం అయితే కనిపించడం లేదు. ఇప్పుడు తమిళ దర్శకుడు పేరు కూడా ఇండస్ట్రీలో వైరల్ గా మారుతుంది.

లింగస్వామి తో అఖిల్ అక్కినేని కాంబినేషన్ సెట్ కావచ్చు అని కథలపై కూడా చర్చలు జరుగుతున్నాయి అన్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఇది నిజం కావొద్దు అనేలా అక్కినేని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎందుకంటే లింగుస్వామి చాలా కమర్షియల్ డైరెక్టర్. ఇప్పటికే రామ్ అతని మీద నమ్మకంతో ది వారియర్ అనే సినిమా చేశాడు. అతి దారుణంగా దొండ కొట్టింది.

అంతకుముందు అల్లు అర్జున్ అతనితో చేయాలని అనుకున్నప్పటికీ రిస్క్ అనిపించి మళ్ళీ వెనుకడుగు వేశాడు. ఇక తమిళంలో పందెంకోడి సినిమాతో మంచి క్రేజ్ అందుకున్న లింగస్వామి అదే సినిమాకు మళ్ళీ సీక్వెల్ చేయగా దారుణంగా డిజాస్టర్ చూశాడు. ఇక ఇప్పుడు మరో తెలుగు హీరో కోసం సంప్రదిస్తున్నారు అని టాక్ వస్తోంది.

అందులో భాగంగానే అఖిల్ తో కూడా అతని చర్చలు జరిగాయని కూడా ప్రచారాలు ఎక్కువైపోతున్నాయి. అయితే ఇది మాత్రం అసలు నిజం కాకూడదు అని అనవసరంగా ఇప్పుడు అఖిల్ ఇలాంటి దర్శకులతో ఏమాత్రం రిస్క్ చేయకూడదు అని ఫాన్స్ అయితే సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేస్తున్నారు. మరి అఖిల్ నెక్స్ట్ దర్శకుడు నిజంగా లింగస్వామి అవుతాడా? లేదంటే మరొకరు లిస్టులోకి వస్తారా? అనేది కాలమే సమాధానం చెప్పాలి.