Begin typing your search above and press return to search.

రష్యాను ముప్పుతిప్పలు పెడుతున్న బోట్‌ డ్రోన్ల ప్రత్యేకతలివే!

ఉక్రెయిన్ - రష్యాల మధ్య యుద్ధం

By:  Tupaki Desk   |   18 July 2023 4:08 AM GMT
రష్యాను ముప్పుతిప్పలు పెడుతున్న బోట్‌ డ్రోన్ల ప్రత్యేకతలివే!
X

ఉక్రెయిన్ - రష్యాల మధ్య యుద్ధం సాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంవల్ల ఇప్పటికే వేల మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షలమంది నిరాశ్రయులయ్యారనేది తెలిసిన విషయమే. ఈ సమయంలో దూకుడు పెంచిన ఉక్రెయిన్ కు సంబంధించిన డ్రోన్ లు రష్యాను ముప్పు తిప్పలు పెడుతున్నాయని తెలుస్తుంది.

అవును... ఉక్రెయిన్‌ అమ్ములపొదిలోని బోట్ డ్రోన్ లు రష్యాను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాయని తెలుస్తుంది. ఉక్రెయిన్‌ వద్ద ఉన్న మారిటైం అన్‌ మ్యాన్డ్‌ సర్ఫేస్‌ వెస్సల్స్‌ (యూ.ఎస్‌.వీ)లపై రష్యా నౌకాదళంలో ఆందోళన వ్యక్తం అవుతోందని అంటున్నారట. కారణం... ఈ బోటు డ్రోన్లు ఆ రష్యా నౌకాదళానికి నిద్రలేకుండా చేస్తున్నాయంట.

5.5 మీటర్ల పొడవు, టన్ను బరువు, 60 గంటలపాటు 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం కలిగిన బోట్లు క్రిమియాలోని రష్యా నౌకాదళ స్థావరం ఉన్న సెవస్తపొల్‌ పై తరచూ ఈ దాడులకు పాల్పడుతున్నాయంట. సుమారు 200 కిలోల పేలుడు పదార్థాలను అమర్చుకోగల ఈ బోట్లు గంటకు గరిష్టంగా 80 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లగలవని అంటున్నారు.

ఇలా చిన్న ఆకారంలో.. చురుగ్గా కదిలే ఈ బోట్లు ఇటీవల కాలంలో తరచూ రష్యా నౌకలపై దాడులు చేస్తున్నాయని తెలుస్తుంది. ఉక్రెయిన్‌ దళాలు వీటి వినియోగంపై కచ్చితమైన శిక్షణ పొంది ఉంటాయని రష్యా అనుమానిస్తోందట. ఈ నేపథ్యంలో తాజాగా కెర్చ్‌ వంతెనపై జరిగిన దాడిలో కూడా ఈ బోట్ డ్రోన్ లే కీలక పాత్ర పోషించి ఉంటాయని అంటున్నారంట. ఈ కెర్చ్ వంతెన రషయాకు అత్యంత ప్రాముఖ్యమైనదని తెలుస్తుంది.

2014లో ఉక్రెయిన్‌ నుంచి క్రిమియాను రష్యా ఆక్రమించుకొంది. ఆ సమయంలో దీనిని తమ ప్రధాన భూభాగంతో కలిపేందుకు భారీ వ్యయంతో కెర్చ్‌ వంతెన ను నిర్మించిందట. దీంతో.. రష్యా దళాలు అక్కడకు చేరుకోవడానికి మార్గం సుగమం అయిందని అంటున్నారు. నాటి నుంచి ఉక్రెయిన్ బలగాల దృష్టి కీలకమైన కెర్చ్‌ వంతెనపై ఉండేదట.

ఉక్రెయిన్‌ భవిష్యత్తులో క్రిమియాను తిరిగి స్వాధీనం చేసుకోవాలటే.. ఈ వంతెనను దెబ్బతీయడం చాలా ముఖ్యమని వారు భావించారంట. దీంతో తాజాగా ఆ వంతెనపై దాడులకు పాల్పడిన ఉక్రెయిన్... ఆ వంతెనను ధ్వంసం చేసిందని అంటున్నారు. ఈ సమయంలో ఈ బోట్ డ్రోన్ లు కీలకంగా పనిచేశారని రష్యా అనుమానిస్తుందట.

గా... ఈ ఏడాది ఏప్రిల్‌ 24న ఇటువంటి ఓ బోటును రష్యా దళాలు పేల్చేశాయంటూ కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ బోట్ల విషయంలో రష్యా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుందని సమాచారం!