Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాలో మునిగి తేలుతున్న మనోళ్లు.. వారానిక అన్ని గంటలా?

మనోళ్ల జీవనశైలి ఎంతలా మారిందన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది తాజాగా విడుదలైన రిపోర్టు.

By:  Tupaki Desk   |   18 Aug 2023 4:29 AM GMT
సోషల్ మీడియాలో మునిగి తేలుతున్న మనోళ్లు.. వారానిక అన్ని గంటలా?
X

మనోళ్ల జీవనశైలి ఎంతలా మారిందన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది తాజాగా విడుదలైన రిపోర్టు. అందివచ్చిన సాంకేతికను అందిబుచ్చుకోవటం బాగానే ఉన్నా.. దాని మత్తులో కూరుకుపోతున్న షాకింగ్ నిజం కలవరపాటుకు గురి చేసేలా మారింది. మీడియాను కొంతకాలం క్రితం డామినేట్ చేసిన సోషల్ మీడియా.. ఇప్పుడు భారతీయుల్ని అంతకంతకూ తన వశం చేసుకున్నట్లుగా చెబుతున్నారు. అంతకంతకూ పెరుగుతున్న దీనికి బానిసలు మాదిరి మారుతున్నట్లుగా రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి.

రోజు మొత్తంలో ఒక్క సోషల్ మీడియా కోసం భారతీయులు కేటాయిస్తున్న సమయం అక్షరాల 194 నిమిషాలు.. అంటే.. మూడుగంటలకు మించి అన్న మాట. ఇంత భారీగా మరే దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున సోషల్ మీడియాకు కనెక్టు అయిపోతున్నది లేదని పేర్కొంటున్నారు. తాజా నివేదిక ప్రకారం సగటు భారతీయులు ఆన్ లైన్ గేమ్ ల కోసం 46 నిమిషాలు.. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లకు 44 నిమిషాలు కేటాయిస్తున్నట్లు చెబుతున్నారు. వీరు వినియోగిస్తున్న డేటా 2.06 మిలియన్లుగా వెల్లడైంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. మొత్తం సోషల్ మీడియా కోసం వినియోగిస్తున్న సమయంలో వంద శాతం మొబైల్ ఫోన్ లేదంటే టాబ్లెట్ల ద్వారానే జరిగినట్లుగా పేర్కొన్నారు.

ఓటీటీ కంటెంట్ కోసం మాత్రం గణాంకాలు కాస్త భిన్నంగా ఉన్నాయి. 68 శాతంమంది స్మార్ట్ ఫోన్లు లేదంటే టాబ్లెట్లు.. 4 శాతం మంది మాత్రం ల్యాప్ టాప్ లు.. పర్సనల్ కంప్యూటర్లు వాడగా.. 28 శాతం మంది మాత్రమే టీవీ లేదంటే హోం థియేటర్ ను వినియోగించటం గమనార్హం. మొత్తంగా వారానికి 22 గంటల పాటు సోషల్ మీడియాతో ఎంగేజ్ అయినట్లుగా పేర్కొన్నారు.

నివేదికలో వాట్సాప్ కు ఎంత టైం వెచ్చిస్తున్నారన్నది పేర్కొనలేదు. దీంతో.. సోషల్ మీడియాకు ఖర్చు చేసే సమయానికి వాట్సాప్.. టెలిగ్రామ్ లాంటవి కలుపుకుంటే మరింత సమయాన్ని గడుపుతున్నట్లుగా తేలుతుంది. ఇదంతా చూస్తే.. స్మార్ట్ ఫోన్ వినియోగించే విషయంలో మనోళ్లు ఎంత క్రేజీగా తయారయ్యారో అర్థమవుతుంది. సోషల్ మీడియాలో గంటల తరబడి సమాయాన్ని కేటాయిస్తున్న వారిలో అత్యధికులు.. ఉచితంగానే సేవల్ని పొందుతున్నారు. ఒకవేళ.. సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం వినియోగం మీద ధరల బాదుడుకు తెరతీస్తే మాత్రం వీటి వినియోగం తగ్గుముఖం పట్టే వీలుందంటున్నారు. జీఎస్టీతో బాదేసే మోడీ సర్కారు.. వీటి ధరల్ని పెంచేయటం ద్వారా.. ఉత్పాదకతను పెంచే వీలుంది. అయినా.. అంతటి తీవ్రమైన నిర్ణయాన్ని కేంద్రం తీసుకునే అవకాశం ఉందంటారా?