Begin typing your search above and press return to search.

మీ ఐఫోన్ ఛార్జింగ్ అయిపోతుందా .. అయితే ?

ఐ ఫోన్లలో ఛార్జింగ్‌ ఎక్కువసేపు ఉండేందుకు మొదటగా చేయాల్సింది 'ఐఓఎస్‌ అప్‌డేట్‌'అని కంపెనీ తెలిపింది.

By:  Tupaki Desk   |   12 May 2024 5:29 AM GMT
మీ ఐఫోన్ ఛార్జింగ్ అయిపోతుందా .. అయితే ?
X

ప్రపంచవ్యాప్తంగా ఐ ఫోన్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ఆ ఫోన్ తో ఉన్న సమస్య అంతా ఛార్జింగ్ తోనే. త్వరగా ఐ ఫోన్ ఛార్జింగ్ అయిపోవడం వినియోగదారులకు ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఐ ఫోన్ ఛార్జింగ్ ఎక్కువ సేపు ఉండేందుకు యాపిల్ కంపెనీ తన వినియోగదారులకు కొన్ని సూచనలు చేస్తున్నది. వాటిని పాటిస్తే మీకు కొంత ఉపశమనం లభించవచ్చు.

యాపిల్ చెప్పిన దాంట్లో ఉన్న ఆసక్తికరమైన అంశం ఐ ఫోన్ లో 16 - 22 డిగ్రీల ఊష్ణోగ్రతలోనే మెరుగ్గా పనిచేస్తాయని చెప్పడం. 35 డిగ్రీల కన్న ఎక్కువ ఊష్ణోగ్రతలు ఉంటే బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుందట. మరి 45 నుండి 50 డిగ్రీల మధ్య ఎండలు మండుతున్న ఈ పరిస్థితులలో ఐ ఫోన్ ను భరించడం మనకు కష్టతరమే. సాధారణ ఊష్ణోగ్రతల వద్దనే ఈ ఫోన్ బాగా పనిచేస్తుందట.

ఐ ఫోన్లలో ఛార్జింగ్‌ ఎక్కువసేపు ఉండేందుకు మొదటగా చేయాల్సింది ‘ఐఓఎస్‌ అప్‌డేట్‌’ అని కంపెనీ తెలిపింది. కొత్త ఐఓఎస్‌ వెర్షన్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయడం చాలా ముఖ్యం అని వెల్లడించింది. ఈ అప్‌డేట్‌లు కొత్త ఫీచర్‌లను అందించడమే కాకుండా బ్యాటరీ లైఫ్‌ను, డివైజ్‌ సామర్థ్యాన్ని పెంచుతాయి.

ఐఫోన్‌ రక్షణ కోసం వాడే పౌచ్ లతో ఛార్జింగ్‌ చేయడం మంచిది కాదట. దీని మూలంగా ఛార్జ్‌ చేసే సమయంలో ఐఫోన్‌ వేడెక్కుతుంది. పౌచ్ లు వేడిని బయటకు పోనీయకుండా చేయడంతో బ్యాటరీ లైఫ్ దెబ్బతింటుంది. ఫోన్‌ ఛార్జ్‌ సమయంలో పౌచ్‌ లేదా కేస్‌లను ఐఫోన్‌కు ఉంచరాదని చెబుతున్నారు. లో పవర్‌ మోడ్‌ను ఎనేబుల్‌ చేసుకుంటే కూడా బ్యాటరీ లైఫ్‌ బాగుంటుందని చెబుతున్నారు. సో ఈ సూచనలు పాటిస్తే మీ ఫోన్లు సురక్షితంగా ఉంచుకోవచ్చు.