Begin typing your search above and press return to search.

ఎన్నాళ్లో వేచిన ఉదయం... ఐఫోన్ అమ్మకాల్లో ఆఫర్లు ఇవే!

యాపిల్ ఉత్పత్తుల అభిమానులు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తోన్న ఐఫోన్‌ - 15 సిరీస్‌ అమ్మకాలు నేటి నుంచి ఇండియాలో మొదలయ్యాయి.

By:  Tupaki Desk   |   22 Sep 2023 11:30 PM GMT
ఎన్నాళ్లో వేచిన ఉదయం... ఐఫోన్  అమ్మకాల్లో ఆఫర్లు ఇవే!
X

యాపిల్ ఉత్పత్తుల అభిమానులు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తోన్న ఐఫోన్‌ - 15 సిరీస్‌ అమ్మకాలు నేటి నుంచి ఇండియాలో మొదలయ్యాయి. దీంతో కొత్త ఐఫోన్‌ లను కొనేందుకు ఉదయం నుంచే యాపిల్ స్టోర్ల వద్దకు చేరుకున్నారు వినియోగదారులు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి. ఈ మేరకు కొన్ని ఆఫర్లు కూడా తెరపైకి వచ్చాయి!

అవును... ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ లోని రిలయన్స్ జియో వరల్డ్‌ డ్రైవ్‌ లోని యాపిల్ బీకేసీ స్టోర్‌ తోపాటు, ఢిల్లీలోని సెలెక్ట్‌ సిటీ వాక్‌ మాల్‌ లో ఉన్న యాపిల్‌ సాకేత్‌ స్టోర్‌ ల ముందు ఐ ఫోన్ అమ్మకాల కోసం అభిమానులు బారులు తీరారు. ఈ నేపథ్యంలో... లాంఛ్‌ ఆఫర్‌ కింద హెచ్‌.డీ.ఎఫ్‌.సీ క్రెడిట్‌ కార్డుతో ఐఫోన్ 15 సిరీస్‌ ను కొనుగోలు చేసేవారు ఇనిస్టెంట్ డిస్కౌంట్‌ పొందవచ్చు.

ఇందులో భాగంగా... ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ మోడళ్ల కొనుగోలుపై రూ.6,000 వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇదే క్రమంలో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడల్స్‌ పై రూ.5,000 డిస్కౌంట్‌ లభించనుంది. దీంతోపాటు పాత ఐఫోన్‌ ను ఎక్స్ఛేంజ్‌ చేయడం ద్వారా ట్రేడ్‌ ఇన్‌ బెనిఫిట్‌ కింద కొంత డిస్కౌంట్‌ పొందవచ్చు.

ఇదే సమయంలో కొత్త ఐఫోన్ సిరీస్‌ అమ్మకాలతో ఇండియన్ మొబైల్‌ మార్కెట్‌ లో అధిక వాటాను సొంతం చేసుకోవాలని యాపిల్ భావిస్తోంది. ఇందులో భాగంగా ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ ఫోన్లు అత్యధికంగా అమ్ముడవుతాయని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ లో బ్లూ టైటానియం, బ్లాక్‌ టైటానియం కలర్‌ వేరియంట్లు అక్టోబర్‌ మూడోవారంలో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

కాగా... ఐఫోన్‌ 15 సిరీస్‌ ను ఈ నెల 12న యాపిల్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మొత్తం నాలుగు వేరియంట్లలో ఈ ఫోన్‌ ను తీసుకొచ్చింది. వీటిలో ఐఫోన్‌ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ లు ఉన్నాయి.

ఇక ఇండియన్ మార్కెట్లో ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ.79,900గా కంపెనీ నిర్ణయించగా... ఐఫోన్ 15 ప్లస్‌ రూ.89,900 గా ఉంది. ఇదే సమయంలో ఐఫోన్ 15 ప్రో ధర రూ.1,34,900 గా ఉండగా... ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ ధర రూ.1,59,900 గా ఉంది!