Begin typing your search above and press return to search.

ఐఫోన్ 15 లాంచ్... ముహూర్తం ఫిక్సయినట్లే?

ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 15 లాంచ్ ఈవెంట్‌ ను ప్రకటించింది.

By:  Tupaki Desk   |   31 Aug 2023 9:09 AM
ఐఫోన్ 15 లాంచ్... ముహూర్తం ఫిక్సయినట్లే?
X

ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 15 లాంచ్ ఈవెంట్‌ ను ప్రకటించింది. ఇందులో భాగంగా నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ 15 స్మార్ట్‌ ఫోన్‌ లు సెప్టెంబర్ 12న లాంచ్ అవుతాయని కంపెనీ వెల్లడించింది! దీంతో ఎన్నాల్లో వేచి ఉదయం... అంటూ ఖుషీ అయిపోతున్నారు ఐఫోన్ ఫ్యాన్స్! దీంతో ఇప్పటికే డబ్బులు, కార్డులు చేతులతో పట్టుకుని ఎదురుచూస్తున్నారంట!

అవును... కాలిఫోర్నియాలోని "ఆపిల్ పార్క్"లో సెప్టెంబర్ 12 ఉదయం 10 గంటలకు.. అంటే భారత్ కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్ల ఆవిష్కరణ ప్రారంభం అవుతుంది. ఈ కార్యక్రమానికి "వండర్ లస్ట్" అనే పేరు ఖరారు చేశారు.

దీంతో ఆపిల్ 2023 ఐఫోన్‌ ధరలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో స్టాండర్డ్, ప్లస్ వెర్షన్‌ లు పాత ధరలకే అందుబాటులో ఉండవచ్చని అంటున్నారు. ఆన్ లైన్ లో సర్క్యులేట్ అవుతున్న సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. రాబోయే ఐఫోన్ లైనప్ బోర్డు అంతటా కొన్ని ఉత్తేజకరమైన మార్పులను తీసుకొచ్చేందుకు రెడీగా ఉందని తెలుస్తోంది.

ఇందులో భాగంగా... ఐఫోన్ 15లోని అన్ని మోడల్‌ లు యూఎస్బీ - సి ఛార్జ్‌ ని కలిగి ఉండటంతోపాటు.. హుడ్ కింద, పవర్‌ ఫుల్ కొత్త ఏ17 బయోనిక్ చిప్ ప్రో మోడల్, ఏ16 ప్రామాణికంగా ఉండవచ్చని తెలుస్తోంది. ఇదే క్రమంలో... ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ "డైనమిక్ ఐలాండ్" ఫీచర్‌ ను అందించవచ్చని అంటున్నారు.

ఇదే క్రమంలో రాబోయే ఐఫోన్ 15 ఈవెంట్‌ లో ఆపిల్ కేవలం స్మార్ట్‌ ఫోన్‌ లను మాత్రమే కాకుండా.. ఇతర ప్రొడక్టులను కూడా ప్రకటించాలని భావిస్తుందని అంటున్నారు. ఇందులో భాగంగా... కొత్త 3డి ప్రింటెడ్ కాంపోనెంట్‌ ల విలీనంతో పాటు ఆపిల్ వాచ్ సిరీస్ 9 రానుందని సమాచారం. ఆపిల్ ఎం3 ప్రాసెసర్‌ తో ఈ కొత్త డివైజ్ లాంచ్ చేయనుంది.