Begin typing your search above and press return to search.

ఆ నాలుగు ఐట‌మ్స్ తోనే మార్కెట్ లోకి అత్తా-కోడ‌ళ్లు!

ఉప్మా.. పులిహోర.. పొంగల్.. రసం లాంటివే అందుబాటులో ఉన్నాయి. ప్ర‌స్తుతానికి ఈ నాలుగు వంట‌కాల‌తోనే వ్యాపాపారం నిర్వ‌హిస్తున్నారు.

By:  Tupaki Desk   |   8 March 2024 5:30 PM GMT
ఆ నాలుగు ఐట‌మ్స్ తోనే మార్కెట్ లోకి అత్తా-కోడ‌ళ్లు!
X

మెగాఅత్తాకోడ‌ళ్లు సురేఖ‌-ఉపాస‌న‌లు సంయుక్తంగా ఫుడ్ బిజినెస్ లోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. సురేఖ పుట్టిన రోజు సంద‌ర్భంగా అత్త పేరిట 'అత్తామ్మాస్ కిచెన్' అంటూ వంట వ్యాపారంలోకి దిగారు. అత్తాకోడ‌లిగా కాకుండా మంచి స్నేహితులుగా మారిపోయి ఇద్ద‌రు కొత్త వ్యాపారం షురూ చేసారు. బిజినెస్ రంగంలో ఉపాస‌న అపార అనుభ‌వం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఒంటిచేత్తో అపోలో గ్రూప్ ని మొత్తాన్ని న‌డిపిస్తున్నారు.

అలాంటి ఉపాస‌న అత్త‌మ్మాస్ కిచెన్ ని స‌క్సెస్ చేయ‌డం ఆమెకి పెద్ద విష‌యం కాదు. త‌న‌కున్న ప‌రిచ‌య‌స్తులంతా అత్త‌మ్మ కిచెన్ కి వస్తే చాలు. ల‌క్ష‌ల వ్యాపారం ఈజీగా జ‌రిగిపోతుంది. స‌రిగ్గా అదే స్ట్రాట‌జీతో అత్తా-కోడ‌లిద్ద‌రు క‌లిసి ఈవెంచ‌ర్ని ప్రారంభించిన‌ట్లు తెలుస్తోంది. మ‌రి అత్త‌మ్మా స్ కిచెన్ లో ఐటమ్స్ ఏంటి అంటే? ఇంటి భోజనాన్ని జ్ఞప్తికి తెచ్చేలా ప్రత్యేకంగా రూపొందించిన ఉప్మా.. పులిహోర.. పొంగల్.. రసం లాంటివే అందుబాటులో ఉన్నాయి. ప్ర‌స్తుతానికి ఈ నాలుగు వంట‌కాల‌తోనే వ్యాపాపారం నిర్వ‌హిస్తున్నారు.

నేరుగా త‌మ సొంత వంట గది నుంచే ఈ నాలుగు ర‌కాల వంట‌కాలు సిద్దం చేసి విక్ర‌యిస్తున్నారు. ఆన్ లైన్ లోనే ఈ బిజినెస్ జ‌రుగుతుంది. అతమ్మాస్ కిచెన్ ఉత్పత్తులకు, రెసిపీలకు ప్రచారం కల్పిస్తూ ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్ ను కూడా ప్రారంభించారు. ఆన్ లైన్ లో తమ ఉత్పత్తులను కొనుగోలు చేసే సదుపాయం కల్పించారు. రానున్న రోజుల్లో అదే కిచెన్ నుంచి మ‌రిన్ని వంట‌కాలు సిద్దం చేసే ప్లాన్ లో ఉన్నారు. పూర్తిగా త‌మ టేస్ట్ కి అనుగుణంగానే అన్నింటిని సిద్దం చేయాలి అన్న ఉద్దేశంతోనే అన్నింటిని ఒకేసారి పెట్టుకోకుండా ద‌శ‌ల వారిగా ఐట‌మ్స్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇంత‌కీ ఈ ఐడియా ఎలా వ‌చ్చిందంటే?

మెగాస్టార్ చిరంజీవి సంవత్సరంలో 200 రోజులు షూటింగ్స్ లోనే గడిపే సమయంలో.. ఆయన కోసం సురేఖ ఇంట్లో వండిన ఆహారాన్ని ప్యాక్ చేసేవారట. దీంతో చిరంజీవికి హోమ్ ఫుడ్ మిస్ అయిన ఫీలింగ్ ఉండేది కాదట. ఈ సమయంలో ప్రజలకు ఇంటి ఆహారంతో ఉన్నగాఢమైన అనుబంధాన్ని గమనించారు సురేఖ. ఈ ఆలోచన నుంచి వచ్చిన ఐడియానే ఇది. ‘అత్తమ్మాస్‌ కిచెన్‌’ కిచెన్ లో సంప్రదాయ వంటకాలు ప్రత్యేకంగా ఉంటాయి. ముఖ్యంగా ఇంటికి దూరంగా ఉన్నవారికి లేదా కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేసే వారు.. ఇంటి భోజనం మిస్ అవ్వకుండా.. రెడీ మిక్స్ రూపంలో టేస్టీ, సంప్రదాయ వంటకాలను ‘అత్తమ్మాస్‌ కిచెన్‌’ అందిస్తుంది.