Begin typing your search above and press return to search.

ల్యాబ్ లో చేప మాంసం ఉత్పత్తి.. దేశంలోనే మొదటిసారి!

దీని రుచి.. రంగు.. పోషకాలు నిజమైన చేపని పోలి ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు.

By:  Tupaki Desk   |   30 Jan 2024 9:30 AM GMT
ల్యాబ్ లో చేప మాంసం ఉత్పత్తి.. దేశంలోనే మొదటిసారి!
X

వినూత్న ప్రయోగానికి తెర తీస్తోంది కేరళ రాష్ట్రంలోని కొచ్చికి చెందిన సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్. అంతకంతకూ పెరుగుతున్న సీఫుడ్ గిరాకీకి అనుగుణంగా ఉత్పత్తిని పెంచటంతో పాటు.. సముద్రంలోని జీవుల సమత్యుల్యాన్ని సంరక్షించేందుకు వీలుగా ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు. చేపల నుంచి వేరు చేసిన కణాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ల్యాబ్ లో డెవలప్ చేసి మాంసాన్ని ఉత్పత్తి చేస్తారు. దీని రుచి.. రంగు.. పోషకాలు నిజమైన చేపని పోలి ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు.

తొలిదశలో కింగ్ ఫిస్.. చందువాయి చేప.. సీర్ ఫిష్ మాంసాన్ని డెవలప్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ.. ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టనున్నారు. ‘నీట్ మీట్ బయోటెక్’ అనే స్టార్టప్ తో సీఎంఎఫ్ఆర్ఐ చేతులు కలిపింది. దీనికి సంబంధించిన ఎంవోయూ పూర్తైంది. ఈ ఒప్పందంలో భాగంగా అధిక విలువ కలిగిన సముద్ర చేప జాతుల ప్రారంభ సెల్ లైన్ డెవలప్ మెంట్ పై పరిశోధన చేస్తారు. రీసెర్చ్.. డెవలప్ మెంట్ కోసం చేప కణాల్ని వేరు చేసి పెంపకం చేస్తారు. జన్యు.. జీవరసాయనపరమైన అంశాల్ని విశ్లేషిస్తారు.

ఇందులో భాగంగా సెల్ కల్చర్ లేబొరేటరీని ఇప్పటికే ఏర్పాటు చేశారు. సెల్ కల్చర్ టెక్నాలజీలో నైపుణ్యం ఉన్న నీట్ మీట్.. సెల్ గ్రోల్ మీడియా ఆప్టిమైజేషన్.. సెల్ అటాచ్ మెంట్ బయోరియాక్టర్ ల ద్వారా ఉత్పత్తి వంటి కార్యకలాపాల్ని చేపట్టనున్నారు. ఈ సరికొత్త ప్రయోగ ఫలితం ఏలా ఉండనుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ప్రాజెక్టు విజయవంతం అయితే.. సీఫుడ్ కు సంబంధించి విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పక తప్పదు.