Begin typing your search above and press return to search.

పాలు మరి ఎక్కువ తాగితే ప్రాణాలు పోయేంత వ్యాధి వ‌స్తుందా?

ఇలా హానిక‌రం కానీ జాబితాలో, ఆరోగ్యంగా ఉంచే వాటిలో పాలు టాప్ లిస్టులో ఉంటాయి.

By:  Tupaki Desk   |   5 Sep 2023 3:00 AM GMT
పాలు మరి ఎక్కువ తాగితే ప్రాణాలు పోయేంత వ్యాధి వ‌స్తుందా?
X

ప్ర‌స్తుత కాలంలో ఆహారం మీద ఎంత శ్ర‌ద్ధ పెరిగిందో, అందులోనూ వ్యాధులు క‌లిగించ‌ని వాటి గురించి జాగ్ర‌త్త‌గా అన్వేషిస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇలా హానిక‌రం కానీ జాబితాలో, ఆరోగ్యంగా ఉంచే వాటిలో పాలు టాప్ లిస్టులో ఉంటాయి. అయితే, ఇప్పుడు ఆ పాలు కూడా అతిగా తాగితే ప్రాణాలు పోయేంత ప్ర‌మాద‌క‌ర‌మైన రోగమైన క్యాన్స‌ర్‌ను క‌లిగించే స్థితికి చేరాయ‌ని యూకే క్యాన్సర్‌ రీసెర్చ్‌ సెంటర్ ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డ‌వడంతో నివ్వెర‌పోవ‌డం సామాన్యుల వంత‌యింది.

ఒంటికి శ‌క్తినిచ్చేందుకు, ప్ర‌శాంతంగా నిద్ర‌ప‌ట్టేందుకు, ముఖ్యంగా కాల్షియం స‌మ‌స్య‌ను దూరం చేసేందుకు పాలు ఉత్త‌మ‌మైనవ‌నే విష‌యం తెలిసిందే. అయితే, ఆ పాలే ఇప్పుడు ప్ర‌మాద‌క‌రంగా మారాయ‌ని, లిండా విశ్వవిద్యాలయం మూడు దశాబ్దాలుగా 22 వేల మంది పురుషులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. పెరుగుదల హార్మోన్లుగా పేర్కొన‌బ‌డే ఈస్ట్రోజన్‌, ఇన్సులిన్ పాల ద్వారా వ్య‌క్తి శ‌రీరంలోకి చేరి, త‌ద‌నంత‌రం క్యాన్సర్‌ వృద్ధికి కారణమవుతాయని ఈ ప‌రిశోధ‌న‌ల్లో తేల్చారు.

స‌హ‌జంగా త‌క్కువ వెన్న శాతం ఉన్న నాన్‌ క్రీమ్‌ పాలను ఎక్కువ మంది కొనుగోలు చేసే సంగ‌తి తెలిసిందే. అయితే ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం అధిక వెన్న శాతం ఉన్న పాల కంటే ఈ ర‌క‌మైన త‌క్కువ వెన్న ఉన్న పాల‌తోనే మరింత ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది.

ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదాన్ని ప్రతి రోజు కాఫీతో పాలు తాగడం వల్ల ఎక్కువ అవుతుంద‌ని, పురుషులకైతే ఆ ప్రమాదం మరింత ఎక్కువగా ఉందని ఈ బృందంలోని ప‌రిశోధ‌కులు హెచ్చరిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా 22 వేలమంది పురుషులకు రోజు 2.5 శాతం పాల ఉత్పత్తులను అందించ‌గా ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం 34 శాతం ఎక్కువగా ఉందని నిర్ధారించారు. అయితే, మ‌రింత లోతైన ప‌రిశోధ‌న‌ల‌తో ఈ ముప్పుపై స్ప‌ష్ట‌త పొంద‌వ‌చ్చున‌ని పేర్కొంటూ ప్ర‌తిరోజూ పాలు తాగే అల‌వాటులో మార్పు చేసుకోవాల‌ని సూచించారు.