భారత భోజన విధానాన్ని ప్రపంచం అవలంభించకపోతే 8 ఎర్త్ లు కావాలి!!
వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) తాజాగా విడుదల చేసిన నివేదిక లివింగ్ ఫ్లానెట్ రిపోర్ట్ వెల్లడించింది.
By: Tupaki Desk | 11 Oct 2024 11:30 AM GMTభారతీయుల ఆహార వినియోగ విధానం అద్భుతం అంటూ కొనియాడుతోంది వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) తాజాగా విడుదల చేసిన లివింగ్ ఫ్లానెట్ రిపోర్ట్! ఈ రిపోర్ట్ ప్రకారం... జీ-20 దేశాలలో భారతదేశ ఆహార వినియోగ విధానాన్ని అత్యంత సుస్థిరమైనదని, అనుకూలమైనదిగా గుర్తించింది.
అవును... భారతీయుల భోజన పద్ధతులు ఎంతో ఉత్తమైనవని.. వాతావారణ అనుకూలమైనవని.. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) తాజాగా విడుదల చేసిన నివేదిక లివింగ్ ఫ్లానెట్ రిపోర్ట్ వెల్లడించింది. ప్రధానంగా నాటికి ఆహార ఉత్పత్తికి ప్రపంచ డిమాండ్ ను పరిగణలోకి తీసుకుంటే.. భారత్ పద్దతులు భేష్ అని తెల్లిపింది.
ఈ నేపథ్యంలో అన్ని దేశాలూ భారతదేశ వినియోగ విధానాలను అవలంభిస్తే.. ప్రపంచానికి ఆహార అవసరాలను నిలబెట్టుకోవడం సులభతరమవుతుందని పేర్కొంది! అయితే... దీనికి విరుద్ధంగా.. ఆస్ట్రేలియా, అర్జెంటైనా, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలు తక్కువ స్థిరమైన నమూనాను కలిగి ఉన్నట్లు గుర్తించబడ్డాయి!
ప్రపంచంలోని ప్రతీ ఒక్కరు 2050 నాటికి ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల ప్రస్తుత ఆహార వినియోగ విధానాలను అవలంబిస్తే ఒకటి నుంచి ఏడు భూముల అవసరం పడుతుందని తెలిపింది. ఇందులో భారత్ తరహా ఆహార విధానాలను అవలంభిస్తే ఒక భూమి సరిపోతుందని ఈ సందర్భంగా నివేదిక స్పష్టం చేసింది!
అలా కాకుండా అర్జెంటీనా ఆహార వినియోగానికి 7.4 భూములు అవసరమవుతాయని.. ఇదే తరహాలో ఆస్ట్రేలియా, అమెరికాల పరిస్థితి కూడా అలాగే ఉందని నివేదిక వెల్లడించింది. భారత్ తర్వాత ఇండోనేషియా, చైనాలు ఈ విషయంలో మెరుగైన స్థానాల్లో ఉన్నాయని తెలిపింది.
ఇదే క్రమంలో ప్రధానంగా భారతదేశ మిల్లెట్ క్యాంపెయిన్ ను ఈ నివేదిక ప్రశంసించింది. ఇవి శరీరానికి మంచి పోషకాలే కాకుండా.. మారుతున్న వాతావరణానికి బాగా సరిపోతాయని తెలిపింది.