Begin typing your search above and press return to search.

ఆన్లైన్ ఫుడ్ కు పెరుగుతున్న డిమాండ్.. భవిష్యత్తులో ఇంటి భోజనం పై పెను సవాల్..

అయితే ఇది కేవలం అనుమానాలు మాత్రమే కాదు.. ఎందుకంటే ఒక్క హైదరాబాదులోనే సుమారు 74,807 రెస్టారెంట్లు ఉన్నాయంటే ఆలోచించండి.

By:  Tupaki Desk   |   23 July 2024 7:21 AM GMT
ఆన్లైన్ ఫుడ్ కు పెరుగుతున్న డిమాండ్.. భవిష్యత్తులో ఇంటి భోజనం పై పెను సవాల్..
X

స్వీగ్గీ ,జొమాటో.. ఇలాంటి ఫుడ్ సర్వీసింగ్ యాప్స్ మొదలుపెట్టినప్పుడు.. ఇటువంటివి ఇండియాలో ఎలా నడుస్తాయి అని ఆలోచించిన వారు ఎందరో. అయితే ఇప్పుడు రోజులో కనీసం ఒక్కసారైనా ఈ ఫుడ్ ఆప్స్ నుంచి భోజనాలు తెప్పించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కొంతమంది భవిష్యత్తులో మన భోజన శైలిపై పలు రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరైతే ఇక మూడు పూటలా హోటల్లోనే తింటారేమో.. 2030 నాటికి భారత దేశంలో చాలావరకు వంటగదిలకు తాళాలేస్తారేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇది కేవలం అనుమానాలు మాత్రమే కాదు.. ఎందుకంటే ఒక్క హైదరాబాదులోనే సుమారు 74,807 రెస్టారెంట్లు ఉన్నాయంటే ఆలోచించండి. వీటితోపాటు క్లౌడ్ కిచెన్ లో కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ఇక కర్రీ పాయింట్స్ విషయానికి వస్తే వీధికి ఒక పాయింట్ పెట్టిన బిజినెస్ బ్రహ్మాండంగా జరుగుతుంది. వీటన్నిటిని బట్టి ఇంట్లో వండుకునే వారి సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది అన్న విషయం స్పష్టమవుతుంది. దేశవ్యాప్తంగా ఏటా కేవలం బిర్యానీలో మార్కెట్ 20 వేల నుంచి 30 వేల కోట్ల వరకు ఉంది . సెకండ్ కి రెండు నుంచి మూడు బిర్యానీల ఆర్డర్లు ఆన్లైన్ ఫుడ్ యాప్స్ లో రావడం సర్వసాధారణంగా మారింది.

ప్రస్తుతం 2024 తొలి త్రైమాసికంలో 175 కోట్ల లాభం లో నడుస్తున్న జొమాటో లాంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ఆప్స్ 2030 నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా. ఇండియాలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ పెరుగుతుంది అంటే అర్థం.. ఇళ్లలో వండుకునే వారి సంఖ్య తగ్గుతుంది అనే కదా. ఇక హెల్తీ ఫుడ్ తినాలి అనుకునే వాళ్లకు కూడా ఆన్లైన్లో ఆప్షన్స్ బాగానే ఉన్నాయి.

డైటింగ్ చేయాలి అనుకునే వారికి పొద్దున తాగే స్మూతీ దగ్గర నుంచి నైట్ తీసుకుని వెజిటేబుల్ సలాడ్ వరకు సప్లై చేసేస్తారు. ఎటువంటి శ్రమ లేకుండా డైటింగ్ కూడా సులభంగా చేయొచ్చు అని చాలామంది ఇటువంటి సర్వీసెస్ కు మొగ్గు చూపుతున్నారు. ఇవన్నీ చాలా అన్నట్టు స్ట్రీట్ ఫుడ్స్ ని కూడా వదలడం లేదు. చిన్న స్ట్రీట్ ఫుడ్ సెంటర్ పెట్టుకున్న ఎందరో ఆంటీలు లక్షల్లో సంపాదిస్తున్నారు అని సోషల్ మీడియాలో మనం చూస్తున్న వార్తలు వీటికి నిదర్శనం.

కోవిడ్ తర్వాత బాగా డెవలప్ అయిన ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే అది ఫుడ్ ఇండస్ట్రీ అనడంలో ఎటువంటి డౌట్ లేదు. రోడ్డు మీద పెట్టే పానీపూరి, మోమోస్ దగ్గర నుంచి రెస్టారెంట్లో సర్వ్ చేసే బిర్యానీ వరకు దేనికి డిమాండ్ తక్కువగా లేదు. వినడానికి ఇవి ఎంతో అందంగా ఉంటాయి.. తినడానికి మరింత రుచిగా ఉంటాయి.. కానీ మన ఆరోగ్యం పై ఇవి చూపించే ప్రభావం గురించి ఎవరు ఆలోచించడం లేదు. బయటకు వెళ్లి తెచ్చుకునే అవసరం లేకుండా ఇంటి వద్దకే సర్వీసు ఇవ్వడం చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి అందరూ ఆర్డర్లు పెడుతున్నారు. కానీ రోజు ఇలా బయట ఫుడ్డు తినడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలి అన్న విషయాన్ని అందరూ మర్చిపోతున్నారు.

ఈ నేపథ్యంలో భావితరాలు భద్రంగా ఉండాలి అంటే.. మనం తీసుకునే ఆహారంపై ఖచ్చితంగా అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యం. మీరు ఇలా రోజు బయట తెచ్చుకొని తింటూ ఉంటే ఒక్కసారి ఆలోచించండి.. మన ఆరోగ్యం మనం తినే ఆహారంలో ఉంటుంది.