అన్ని రికార్డులను బద్దలు కొట్టబోతున్న ఫుడ్ సర్వీస్..
భారతదేశంలో పరిశ్రమల వృద్ధి అత్యధికంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే.
By: Tupaki Desk | 4 July 2024 6:07 AM GMTభారతదేశంలో పరిశ్రమల వృద్ధి అత్యధికంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం మన దేశంలో ఆహార సేవల పరిశ్రమ అంచనాలకు మించి ఎదుగుతుంది. తాజా అంచనాల ప్రకారం 2030 నాటికి ఈ రంగం మార్కెట్ విలువ సుమారు రూ.10 లక్షల కోట్లకు చేరుకుంటుందని అని అంచనా.బెయిన్ అండ్ కంపెనీ, స్విగ్గీ సంయుక్తంగా ఈ విషయాన్ని ‘హౌ ఇండియా ఈట్స్’పేరుతో ఒక నివేదిక ద్వారా వెల్లడించారు.
గతంలో కంటే కూడా ఇప్పుడు ఆన్లైన్ సేవలను ఉపయోగించి ఫుడ్ డెలివరీ పెట్టుకోవడం చాలా సులభంగా మారింది. పట్టణాల నుంచి పల్లెటూర్ల వరకు స్విగ్, జొమాటో వంటి డెలివరీ సంస్థలు అద్భుతమైన ఫుడ్ సర్వీస్ను అందిస్తున్నాయి. దీంతో ప్రతిరోజు ఆర్డర్ పెట్టే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో 230 నాటికి దేశీ ఆహార సేవల పరిశ్రమ అద్భుతంగా రాణిస్తుందని తెలుస్తోంది.
హౌ ఇండియా ఈట్స్ పేరుతో విడుదల చేసిన నివేదిక ప్రకారం 2003 నాటికి కస్టమర్ల సంఖ్య కూడా 45 కోట్ల వరకు చేరుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం రూ.5.5 లక్షల కోట్ల స్థాయిలో ఉన్న మార్కెట్ విలువ ఏడేళ్ల తర్వాత ప్రతి సంవత్సరానికి 10 నుంచి 12% వృద్ధిని నమోదు చేసుకుంటుందని సర్వే వెల్లడించింది. ఈ ఎదుగుదలకి ఒకరకంగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలే కారణం. అనడంలో ఎటువంటి డౌట్ లేదు.
స్విగ్గి లాంటి ఆన్లైన్ సంస్థలు వాడకం పెరిగిన తర్వాత రోజువారి డెలివరీలు ఎక్కువవుతున్నాయి. క్లౌడ్ కిచెన్ దగ్గర నుంచి పెద్ద రెస్టారెంట్స్ వరకు.. చిరు వ్యాపారస్తుల నుంచి బ్రాండ్ బాబుల వరకు ప్రతి ఒక్కరికి ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియా పుణ్యమా అని ఫుడ్ ఇక్కడ బాగుంది.. అక్కడ బ్రహ్మాండంగా ఉంది అని వస్తున్న రీల్స్ చూసి ఆర్డర్లు పెట్టే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇలా మొత్తానికి మనదేశంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ఆహార సేవల పరిశ్రమను వృద్ధి చేయడంలో తన వంతు పాత్ర పోషిస్తుంది.
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ విభాగం ప్రతి సంవత్సరం 18% వృద్ధిరేటుతో దూసుకుపోతోంది. 2023 నాటికి 12 శాతంగా ఉన్న ఈ విభాగం 2030 కి 30 శాతానికి చేరుకుంటుంది అని అంచనా వేస్తున్నారు. అంతేకాదు ప్రస్తుతానికి 70 శాతం వరకు జరుగుతున్న బిజినెస్ మనదేశంలోని 50 ప్రధాన నగరాల నుంచే వస్తోంది. అయితే రాబోయే రోజులలో ఈ సేవలు మరింత విస్తరించి ద్వితీయశ్రేణి నగరాల నుంచి కూడా వృద్ధిరేటు అత్యధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు సర్వే వెల్లడిస్తోంది. దీంతో చాలామంది ఇప్పుడు ఫుడ్ బిజినెస్ పై ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.